విక్ట‌రీ వెంక‌టేష్ త‌న కెరీర్ లో పాడిన ఏకైక సాంగ్ ఇదే.. య‌మా పాపుల‌ర్‌!

మన టాలీవుడ్ లో చాలామంది హీరోలు గొంతు సవరించుకొని తమ గాత్రంతో అభిమానులు అలరించారు. తమ సినిమాల్లోనే కాకుండా ఇతర హీరోల సినిమాల్లోనూ పాటలు పాడి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఈ జాబితాలో విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు. దాదాపు మూడు దశాబ్దాల నుంచి తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా సత్తా చాటుతున్న వెంకటేష్‌.. ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కెరీర్ ను పరుగులు పెట్టిస్తున్నారు.

లవ్, కామెడీ, యాక్షన్, డ్రామా.. ఇలా అన్ని తరహా సినిమాల్లోనూ నటిస్తూ అలరిస్తున్నారు. అయితే ఇన్నేళ్ల కెరీర్ లో విక్టరీ వెంకటేష్ ఒక సాంగ్ పాడారు. మ‌రి ఆ సాంగ్ ఏదో మీకు గుర్తుందా..? అదే `జింగిడి జింగిడి..` సాంగ్‌. గురు సినిమా కోసం వెంకటేష్ మొదటి సారి తన గొంతు సవరించారు. బ్యాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో సుధ కొంగర ఈ సినిమాను తెర‌కెక్కించారు.

ఇందులో వెంకటేష్ బాక్సింగ్ కోచ్ గా న‌టిస్తే.. లేడీ బాక్స‌ర్ గా రితికా సింగ్ చేసింది. 2017లో విడుద‌లైన గురు మూవీ మంచి విజ‌యం సాధించింది. అయితే ఈ సినిమాలో భాస్కరభట్ల రవికుమార్ ర‌చించిన `జింగిడి జింగిడి..` వెంకీ స్వ‌యంగా ఆల‌పించారు. మద్యం గొప్పతనం గురించి చెప్తూ సాగే ఈ పాట అప్ప‌ట్లో య‌మా పాపుల‌ర్ అయింది. ఇప్ప‌టికీ ఆ సాంగ్ ఎక్క‌డో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది.