తన పుట్టుకపై మరోసారి అనసూయ వివాదాస్పద ట్వీట్

జబర్దస్త్ బ్యూటీ, నటి అనసూయ ఎప్పుడూ ఏదోక వివాదంలో ఉంటూ ఉంటుంది. ఆమె చేసే వ్యాఖ్యలు, ట్వీట్లు ఎప్పుడూ వివాదాస్పదంగా మారుతూ ఉంటాయి. తరచూ తన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే అనసూయ… తాజాగా మరోసారి కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది. అనుకునేవాళ్లు ఎన్నైనా అనుకోండి అంటూ తన పుట్టుకపై అనసూయ షాకింగ్ ట్వీట్ చేసింది. తాజాగా సోషల్ మీడియాలో తన అభిమానులతో ఆమె సంభాషించారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తనదైన శైలిలో ఫ్యాన్స్ క్వశ్చన్స్ కు ఆన్సర్ ఇచ్చారు.

ప్రస్తుతం ప్రేమ విమానంలో సినిమా ద్వారా అనసూయ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో అనసూయ కీలక పాత్రను పోషించింది. అక్టోబర్ 13న ఈ సినిమా రిలీజ్ అవ్వగా. ఈ సందర్భంగా నెటిజన్లను అనసూయ ముచ్చటించింది. ఈ సందర్బంగా ఒక నెటిజన్ మీది తుని భాష అటగా అని కామెంట్ చేశాడు. దీనికి అనసూయ స్పందిస్తూ.. అనుకునే వాళ్లు ఎన్నైనా అనుకుంటారు. తాను పుట్టి, పెరిగి, చదువుకుంది హైదరాబాద్ నే అని తెలిపింది. ఈ సినిమాలో అనసూయ తెలంగాణ మాండలికంలో మాట్లాడింది. అచ్చం తెలంగాణ మాండలికం ఎలా ఉంటాడో అలాగే మాట్లాడింది.

దీంతో ఓ నెటిజన్ ప్రేమ విమానం సినిమాలో మీ నటన, తెలంగాణ మాండలికం బాగుందని కామెంట్ చేశాడు. తెలంగాణ మాండలికాన్ని బాగ ఓన్ చేసుకుని చక్కగా డైలాగ్స్ చెప్పారంటూ కితాబిచ్చారు. దీంతో అనసూయ స్పందిస్తూ.. తాను ఇక్కడదాన్నే అని, అందుకే ఓన్ చేసుకున్నానని తెలిపింది. దీనికి సమాధానంగా మరో నెటిజన్.. మీది తుని అంట కదా అని అడగ్గా.. అనసూయ స్పందిసతూ తనది హైదరాబాద్ నే అని తెలిపింది. అయితే అనసూయ సాధారణంగా ఆంధ్రా మండలికం మాట్లాడుతుంది.