సెన్సార్ రిపోర్ట్ కంప్లీట్ చేసుకున్న ” భగవంత్ కేసరి “…!!

నందమూరి నటసింహం బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ” భగవంత్ కేసరి ” పై రోజు రోజుకు అందరిలో భారీ స్థాయిలో అంచ‌నాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా శ్రీ లీల కీలకపాత్రలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. తొలిసారిగా ఈ మూవీ ద్వారా బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్‌పాల్ టాలీవుడ్‌కి పరిచయం అవ్వనున్నాడు.

ఈ మూవీలో ఈయన విలన్ గా కనిపించనున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి థమన్ అందించిన సాంగ్స్, ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ఇలా అన్ని నందమూరి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఏర్పరిచాయి.

తాజాగా ఈ సినిమా యొక్క సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అవ్వగా దీనికి యు/ఏ సర్టిఫికెట్ లభించింది. ఇక ఈ మూవీ రన్ టైం 2:44 నిమిషాలు గా ఉంది. కాగా ఈ మూవీని చూసిన సెన్సార్ వారు మెచ్చుకున్నట్లు సమాచారం. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గరపాటి, హరీష్ పెద్ది గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 19న ఆడియన్స్ ముందుకి రానుంది.