రవితేజ పై హీరోయిన్ తాప్సీ ఘాటు కామెంట్స్..అంత మాట అనేసింది ఏంటి..!

ఈ మధ్యకాలంలో హీరోయిన్ తాప్సి సంచలన కామెంట్స్ చేసి ఎలా సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో మనం బాగా చూస్తూనే ఉన్నాం . తాజాగా పరోక్షకంగా తెలుగు హీరో రవితేజ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి . రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడిన తాప్సి తెలుగులో సినిమాలు చేయకపోవడం పై స్పందించింది .

“కమర్షియల్ హీరోలకు జోడిగా నటించే ఛాన్స్ వస్తే మాత్రం వదులుకోను కానీ, నాకు ఇప్పటివరకు అలాంటి అవకాశం రాలేదు. నా వరకు చిన్న సినిమాలలో నటించడమే ఆత్మ సంతృప్తిగా అనిపిస్తూ ఉంటుంది . పరిమితంగా పారితోషకం ఇచ్చిన అలాంటి సినిమాలను నటించడం వల్ల ఆత్మసంతృప్తి లభిస్తుంది. సరైన కథలు రాకపోవడం వల్లే నేను తెలుగులో నటించలేకపోతున్నాను “.

“భాష ఏదైనాప్పటికీ కథ నచ్చకపోతే నటించను అంటూ ఘాటుగా స్పందించింది “. అయితే పరోక్షకంగా తాప్సి – రవితేజ నే కామెంట్ చేసింది అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి . తాప్సి రవితేజతో వీర , దరువు లాంటి హిట్ సినిమాలను అందుకుంది . అయినా ఇలాంటి కామెంట్స్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారాయి..!!