ఎన్టీఆర్- కళ్యాణ్ రామ్ మధ్య చిచ్చు పెట్టిన స్టార్ డైరెక్టర్.. ఈగో సాటిస్ఫై అయ్యిందా సార్..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. రామలక్ష్మణులాంటి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ల మధ్య స్టార్ డైరెక్టర్ కొరటాల శివ చిచ్చుపెట్టాడా..? అంటే అవును అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది . కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర . ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా తెలుగు తెరపైకి ఎంట్రీ ఇవ్వబోతుంది. సెకండ్ హీరోయిన్గా రష్మిక లేదా మృణాల్ ఠాకూర్ ని సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్ .

ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కబోతున్నట్లు రీసెంట్ గానే అఫీషియల్ గా ప్రకటించాడు కొరటాల శివ. ఇలాంటి క్రమంలోనే కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ల మధ్య ఉన్న గొడవలు బయటపడ్డాయి . నిజానికి ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా ఉన్నాడు కళ్యాణ్ రామ్. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా వద్దు అంటూ హెచ్చరిస్తూనే వచ్చాడట కళ్యాణ్ రామ్ . కానీ ఎన్టీఆర్ – కొరటాల వినలేదు .

అంతేకాదు కొరటాల కళ్యాణ్ రామ్ మాటలని అసలు పరిగణలోకి తీసుకోలేదట . ఎన్టీఆర్ కు చెప్పి ఆయన పర్మిషన్ లేకుండానే ఎన్టీఆర్ కు చెప్పి కళ్యాణ్రామ్ పర్మిషన్ లేకుండానే అఫీషియల్ అప్డేట్ ఇచ్చేసాడట .దీంతో హర్ట్ అయిన కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ను అప్రోచ్ అయినా.. ఎన్టీఆర్ సైలెంట్ గా ఉండిపోయారట . దీంతో కళ్యాణ్రామ్ కూడా కోప్పడి ఎన్టీఆర్ తో మాట్లాడడం మానేశారట . ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. మంచి అన్నదమ్ముల మధ్య కొరటాల భళే చిచ్చుపెట్టాడే అంటూ ఫ్యాన్స్ ఫైర్ అయిపోతున్నారు..!!