స్టార్ నటుడు శ్రీకాంత్ అయ్యర్ పై దాడి.. వీడియో వైరల్.!!

శ్రీకాంత్ అయ్యర్ .. ఇండస్ట్రీలో ఎంతోమంది నటులు ఉన్న ఈ పేరు చెప్పగానే జనాలు చాలా బాగా నవ్వుకుంటూ ఉంటారు . తన పెర్ఫార్మెన్స్ తో తెరపై జనాలను కడుపుబ్బ నవ్వించడంలో నెంబర్ 1 యాక్టర్ అని చెప్పాలి . అయితే నిన్న మొన్నటి వరకు కేవలం సినిమాల వరకే పరిమితమైన ఈ యాక్టర్ ఇప్పుడు పాలిటిక్స్ వైపు కూడా అడుగులు వేస్తున్నారు . పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తాడా లేదా అన్న విషయం పక్కన పెడితే..  పరోక్షకంగా పాలిటిక్స్ పై తన ఘాటు వ్యాఖ్యలు ఇతరులకు మండిపోయేలా చేస్తున్నారు.


రీసెంట్ గానే  వైసీపీ పార్టీపై పరోక్షంగా కామెంట్స్ చేసిన శ్రీకాంత్ అయ్యార్ “ఏపీలో నేను బూమ్ బూమ్ మందు తాగుతున్నాను అని.. నా ప్రాణాలు ఉంటాయో పోతాయో ఆ దేవుడికే తెలియాలి ” అంటూ వ్యంగంగా ట్విట్ చేశారు . దీనిపై అప్పట్లో ఎంత పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయో మనం చూసాం.  అయితే తాజాగా మరో వీడియో ఈయన షేర్ చేశాడు .

ఈ వీడియోలో ఆయనపై ఎవరో దాడి చేస్తున్నట్లు కనిపిస్తుంది. “అమ్మ బాబోయ్.. నాపై దాడి చేస్తున్నారు .. నన్ను కాపాడండి అన్న విధంగా మాట్లాడుతూనే ..లాస్ట్ లో ఎవరు ఏం చేసినా సరే స్పెషల్ స్టేటస్ సాధిస్తాను అంటూ ఘాటుగా చెప్పుకొస్తారు”.  అయితే ఇది అంతా ఫన్నీ వీడియోనే అయినా కావాలని వైసిపిని టార్గెట్ చేస్తూ శ్రీకాంత్ అయ్యార్ ఇలా పెట్టాడు అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది..!!