తిరుమలలో బన్నీ భార్య చేసిన పనికి జనాలు ఫిదా… దట్ ఈజ్ స్నేహ రెడ్డి..!!

స్టార్ సెలబ్రిటీస్ ఎక్కడికైనా బయటకు వస్తే ఏ రేంజ్ లో హంగామా చేస్తూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా కొంతమంది స్టార్ హీరోల భార్యలు ఏదైనా పుణ్యక్షేత్రానికి వస్తే మరింత స్థాయిలో వాళ్ళ పబ్లిసిటీ పాపులారిటీ చూపిస్తూ ఉంటారు . బాడీగార్డ్స్ తో వాళ్లను టచ్ చేయకుండా నానాహంగా చేస్తూ ఉంటారు . అయితే రీసెంట్గా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి చేసిన పనికి మాత్రం జనాలు ఫిదా అయిపోయారు.

అల్లు అర్జున్ లాగే సింప్లిసిటీ అంటే ఇష్టం అంటూ ఓ రేంజ్ లో పొగడేస్తున్నారు . రీసెంట్గా భర్తతో వెకేషన్ ను ఎంజాయ్ చేసిన స్నేహ రెడ్డి ఇండియాకు తిరిగి రాగానే తిరుమల శ్రీవారిని దర్శించుకునింది . అది కూడా కాలినడకన మెట్ల మార్గంలో నడుచుకుంటూ మెట్టు మెట్టుకు దీపం వెలిగిస్తూ తిరుమల కొండ చేరుకునింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

అయితే బన్నీ భార్య స్నేహ సింపుల్ లుక్స్ కు జనాలు ఫిదా అయిపోతున్నారు. అంతేకాదు అంత పెద్ద స్టార్ సెలబ్రెటీ అయినా సరే ఏ మాత్రం హెడ్ వెయిట్ లేకుండా చాలా సింపుల్ లుక్స్ లో మెరిసిపోతూ దేవుడి సన్నిధిలో ఇలా చేయడం అభిమానులకి బాగా నచ్చేసింది . అందుకే స్నేహారెడ్డిని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!