“ఆ విషయంలో ప్రభాస్ మమ్మల్ని బాధపెట్టాడు”.. శ్యామలాదేవి కామెంట్స్ వైరల్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ హీరో కృష్ణంరాజుకి ఎలాంటి క్రేజ్ – పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . మరీ ముఖ్యంగా ఆయన కొన్ని సినిమాల్లో నటించిన తీరు స్టార్ హీరోలకి సైతం ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని పాత్రల్లో కృష్ణంరాజు తప్పిస్తే ఈ పాత్రను మరి ఎవరు ఈ విధంగా నటించలేరు అని చెప్పక తప్పదు . అలాంటి మంచి నటుడు . ఆయన వారసత్వముగా ఇండస్ట్రీలోకి వచ్చాడు ప్రభాస్ .

వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు అన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. రీసెంట్గా ఈ మధ్యకాలంలోనే కృష్ణంరాజు అనారోగ్య కారణంగా మరణించారు . ఆ తర్వాత ఆయన భార్య శ్యామలాదేవి సైతం బయట ఎక్కువగా తిరగడం మానేశారు. కాగా కృష్ణంరాజు మరణించిన తర్వాత కుటుంబ బాధ్యతలు మొత్తం ప్రభాస్ నే చూసుకుంటున్నాడు. ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి .

రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ప్రభాస్ పెళ్లి పై షాకింగ్ కామెంట్స్ చేసింది . అంతేకాదు అన్ని విషయాలలో మంచిగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ పెళ్లి విషయంలో మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని.. త్వరగా పెళ్లి చేసుకొని బిడ్డల్ని కంటే మేము ఎత్తుకొని ఆడించి మా ముచ్చటలను తీర్చుకుంటామని చెప్పుకొచ్చింది. అంతేకాదు కృష్ణంరాజుకు ప్రభాస్ పిల్లల్ని ఎత్తుకోవాలని ఎంతో ఆశగా ఉండిందని .. కానీ ఆ విషయంలో ప్రభాస్ మమ్మల్ని హర్ట్ చేశాడు అంటూ చెప్పుకురావడం ఇప్పుడు వైరల్ గా మారింది..!!