ఆడిషన్స్‌కి వెళ్తే బాడీ షేవింగ్ చేశారు.. బిగ్‌బాస్ బ్యూటీ పూజ మూర్తి..!!

బుల్లితెర నటి పూజా మూర్తి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ” గుండమ్మ కథ ” సీరియల్ లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే సూపర్ క్వీన్స్ షోలో కూడా పాల్గొంది. ఇక ఇప్పుడు బిగ్ బాస్7 2.0 బినీ లాంచ్ తో హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. పూజకు మొదట్లోనే ఇంట్లోకి వెళ్లే ఛాన్స్ వచ్చింది. కానీ ఆమె తండ్రి చనిపోవడంతో ఇంట్లోకి వెళ్ళలేక పోయింది.

తాజాగా పూజ తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి పలు విషయాలను వెల్లడించింది. ” నేను కన్నడ పరిశ్రమకు చెందిన అమ్మాయిని. నటనపై ఆసక్తితో కెరీర్ మొదట్లో ఆఫీసులకు వెళుతూ ఆడిషన్స్ ఇచ్చాను. ఇలా ఆడిషన్స్ ఇచ్చే సమయంలో చాలామంది నేను లావుగా ఉన్నానని నన్ను రిజెక్ట్ చేసేవారు.

ఇలా ఆడిషన్స్ కి వెళ్లిన ప్రతిసారి బాడీ షేమిగింగ్ కామెంట్స్ రావడంతో గదిలో ఒంటరిగా కూర్చుని ఏడ్చే దానిని. టాలెంట్ ఉంటే మనల్ని ఎవరు తొక్కేయలేరు అనుకుని అందుకే ఎన్ని అవమానాలు ఎదురైనా నేను నా ప్రయత్నాలు ఆపలేదు. చాలా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలోనే తెలుగులో సీరియల్స్ చేసే అవకాశం అందుకున్నాను ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూజ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.