“అది నా DNA లోనే ఉంది”.. ఇచ్చిపడేసిన సితార..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని ఏ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా సితార పాప ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకుంది . రేపో మాపో సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది .

ఇలాంటి క్రమంలోనే సితార చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . రీసెంట్గా సితార నేషనల్ సినిమా డే సందర్భంగా తన తాత సూపర్ స్టార్ కృష్ణ మరియు తండ్రి మహేష్ బాబు లకు తన పోస్ట్ ను అంకితం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టకు వచ్చింది . ” వెండితెరపై అగ్రగామిగా నిలిచిన మా నాన్నకు.. తనకు తండ్రిగా ఎలా ఉండేవారు అలాగే నాకు స్ఫూర్తిగా నిలిచారు. లెజెండరీ ఎవర్గ్రీన్ సూపర్ స్టార్ కృష్ణ మా తాతగారు మా అందరిపై ఇంతటి గాడమైన ప్రభావం చూపారు ..

ఆయన వారసత్వంలో నేను భాగమైనందుకు చాలా చాలా గర్వపడుతున్నాను .. నా సోదరుడు నా నుంచి ప్రత్యేక ధన్యవాదాలు ” అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది . దీనితో సోషల్ మీడియాలో మహేష్ బాబు ఫ్యాన్స్ సితారను పొగడేస్తున్నారు . మొత్తానికి సితార నటనకు పనికిరాదు అని కామెంట్ చేసే వాళ్లకు ఇచ్చిపడేసింది ఈ పిల్ల..!!