వరుణ్ తేజ్ పెళ్లి పై పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ సంచలన కామెంట్స్.. ఆ ఒక్క మాటతో పరువు మొత్తం తీసేసిందిగా..!!

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి మరో రెండు రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న విషయం అందరికీ తెలిసిందే . ఇప్పటికే లావణ్య – వరుణ్ – మెగా ఫ్యామిలీ – అల్లు ఫ్యామిలీ – కామినేని ఫ్యామిలీ .. అందరూ ఇటలీ చేరుకున్నారు . అక్కడ వాళ్లు సరదాగా గడుపుతున్న పిక్స్ సైతం షేర్ చేస్తున్నారు .

ఇలాంటి క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ వరుణ్ పెళ్లి పై ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది . ఆమె మాట్లాడుతూ..” వరుణ్ తేజ్ పెళ్లి చేసుకుంటున్నాడు అంటే చాలా సంతోషంగా ఉంది . మొదటి నుంచి వరుణ్ తో నాకు చాలా స్పెషల్ బంధం ఏర్పడింది . వరుణ్ తేజ్ నాకు 8 ఏళ్ల వయసు అప్పటి నుంచి తెలుసు “.

“నా కళ్ళముందే పెరిగాడు ..కానీ అతని పెళ్లికి నాకు వెళ్లాలని లేదు.. నా బెస్ట్ విషెస్ మాత్రం అతడికి ఎప్పుడూ ఉంటాయి. నాకు వరుణ్ తేజ్ వెడ్డింగ్ కార్డ్ ఇచ్చాడు . కానీ నాకు వెళ్లాలని లేదు . నిహారిక పెళ్లికి కూడా ఆహ్వానం అందింది . అప్పుడు నా పిల్లల్ని పంపించాను .. ఎందుకో తెలియదు నాకు వరుణ్ పెళ్లికి వెళ్లాలని లేదు. ఆయన ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ” అంటూ చెప్పుకొచ్చింది రేణు దేశాయ్. దీంతో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి..!