హాస్పిటల్ లో అడ్మిట్ అయిన సాయి పల్లవి..ఆ అపరేషన్ చేయించుకోబోతుందా..?

వామ్మో.. ఏంటిది హీరోయిన్ సాయి పల్లవి కూడా సర్జరీ చేయించుకోబోతుందా..? ఎందుకు..? ఏమైంది..? అసలు ఆమె సర్జరీ చేసుకోవాలని నిర్ణయం ఎందుకు తీసుకుంది. ఇలాంటి కామెంట్స్ తోనే సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు ఆమె అభిమానులు. కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం సాయి పల్లవి త్వరలోనే సర్జరీ చేయించుకోబోతుందట .

దీనికి సంబంధించిన ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేసిందట . అయితే ఆమె సర్జరీ చేయించుకునేది అందం కోసమో ..? ఇంకా గ్లామరస్ గా కనిపించడం కోసమో కాదు.. ఆమెకు డాన్స్ వేసేటప్పుడు కాళ్లు బాగా నొప్పి తీస్తుందట . మోకాళ్ళ దగ్గర చిన్న మైనర్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉందట . డాక్టర్ చాలా సంవత్సరాల నుంచి ఇది చెప్పుకొస్తున్నారట .

కానీ సాయి పల్లవి నెగ్లెక్ట్ చేస్తూ వచ్చిందట . ఫైనల్లీ నొప్పి ఇంకా ఎక్కువైపోవడంతో ఆ నొప్పి తగ్గించుకోవడానికి ఇంకా మంచి మంచి స్టెప్స్ వేసి జనాలను అలరించడానికి ఆమె నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. సాయి పల్లవి చేయించుకున్నే సర్జరీ చాలా చాలా మైనర్ ది అంటూ ప్రచారం జరుగుతుంది..!!