నక్క తోక తొక్కిన రష్మిక..బంపర్ ఆఫర్ కొట్టేసిందిగా.. పుష్ప సినిమా కి మించిన హిట్ పక్కా..!!

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. ఖాతాలో మరో బిగ్ బంపర్ ఆఫర్ వచ్చి చేరిందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . మరి ముఖ్యంగా టాలీవుడ్ లో కంటే బాలీవుడ్ లో విచ్చలవిడిగా దూసుకుపోతున్న రష్మిక మందన్నా.. ఇప్పుడు అందుకున్న ఆఫర్ మాత్రం పుష్పకు మించిన రేంజ్ లో హిట్ పడుతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఆ సినిమా మరేదో కాదు వార్ 2. ఎస్ ఎన్టీఆర్ -హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా.. హీరోయిన్గా సెలెక్ట్ అయిందట. అంతేకాదు అగ్రిమెంట్ పేపర్లపై కూడా సైన్ చేసేసినట్లు.. వార్త వైరల్ అవుతుంది. దీంతో రష్మిక ఖాతాలో మరో జాక్ పాట్ ఆఫర్ హిట్ పక్క అంటూ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.

అంతేకాదు దీన్నంతటికి కారణం పుష్ప సినిమానే అంటూ బన్నీ ను సైతం ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. మొత్తానికి రష్మిక ఖాతాలో మరో బంపర్ హిట్ పక్క అని ఫిక్స్ అయిపోయారు జనాలు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..?