బాల‌య్య మ‌ర‌ద‌లికి బంప‌ర్ ఆఫ‌ర్‌… ఏకంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలో ఛాన్స్‌..!

నందమూరి బాలకృష్ణతో ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన సూపర్ హిట్ సినిమా వీరసింహారెడ్డి లో నటించి ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది హనీ రోజ్. అంతకుముందు టాలీవుడ్ లో 10 సంవత్సరాల క్రితం ఒకటి, అరా సినిమాలు చేసిన అసలు హనీరోజ్ అన్న ఒక హీరోయిన్ ఉందన్న విషయమే చాలామంది సినీ జనాలకు తెలియదు. ఎప్పుడు అయితే వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్యకు మరదలు పాత్రలో నటించిందో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. దీంతోపాటు ఈ సినిమాలో ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంది. మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అన్న పాటలు బాలయ్యతో పోటీపడి మరి స్టెప్పులు వేసింది. మూడున్నర పదుల వయసుకు

చేరువవుతున్నాయి ముద్దుగుమ్మ తన అందచందాలతో తెలుగు కుర్రకారుకు మతిపోగోడుతుంది. వీర సింహారెడ్డి దెబ్బతో హనీ రోజ్ కు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె బంపర్ ఆఫర్ కొట్టేసింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న భగత్ సింగ్ సినిమాలో హనీ రోజ్ ఓ కీలక పాత్రలో

నటించబోతుంది. ఈ సినిమాలో పవన్ కి జోడిగా మెయిన్ హీరోయిన్ గా శ్రీలలా ఎంపికైంది. ఇక మరో కీలక పాత్రకు హనీ రోజ్ ను దర్శకుడు హరీశంకర్ తీసుకున్నట్టు తెలుస్తోంది. హనీ అనగానే బోల్డ్ క్యారెక్టర్ అనుకుంటారు కానీ పవన్ సినిమాలో ఆమె సిన్సియర్ రోల్ చేయనుందట. పవన్ పక్కన హనీ రోజ్ ఛాన్స్ కొట్టేసింది. అంటే ఇక ఆమె దశ తిరిగిపోయినట్టే చెప్పాలి.