బఠాణి ప్రోటీన్ పౌడర్.. ఎన్ని ప్రయోజనాలు తెలిస్తే రోజు తీసుకోకమానరు..

ప్రోటీన్ పౌడర్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ ప్రోటీన్ పౌడర్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నిపుణుల సూచనల ప్రకారం వీటిని తీసుకోవాలి. అయితే డైటీషన్స్ చెప్పినా డైట్ ప్రకారమే కొంత మోతాదులో ఈ ప్రోటీన్ పౌడర్‌ను చాలామంది తీసుకుంటూ ఉంటారు. వీటిల్లో చాలా కాస్ట్లీ ప్రోటీన్ పౌడర్స్ కూడా ఉంటాయి. వేలకు వేలు, లక్షలు కూడా పెట్టి మరి ఈ ప్రోటీన్ పౌడర్స్‌ కొంటూ ఉంటారు. అయితే ఈ ప్రోటీన్ పౌడర్లు ఇంట్లోనే లభ్యమయ్యే కొన్ని వాటితో సులభంగా తయారు చేసుకోవచ్చు.

శరీరానికి కొంత‌ మోతాదుల్లో మాత్రమే ప్రోటీన్స్ అవసరం ఉంటుంది. ఎక్కువైతే అనారోగ్య సమస్యలు తప్పవు. ఇక పసుపు, బఠానీలతో కూడా ప్రోటీన్ పౌడర్ తయారు చేస్తారన‌ విషయం కూడా చాలామందికి తెలియదు. ఈ ప్రోటీన్ పౌడర్ ను మనం కూడా తయారు చేసుకోవచ్చు. వీటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వెల్లడించారు డాక్టర్స్‌. మరి పసుపు, బఠానీలతో చేసిన ప్రోటీన్ పౌడర్లు ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో ఒకసారి తెలుసుకుందాం. ఈ ప్రోటీన్ పౌడర్లో ఐరన్ ఎక్కువగా లభిస్తుంది.

చెడు కొలెస్ట్రాల్ కరిగించడానికి ఈ ప్రోటీన్ పౌడర్ బాగా ఉపయోగపడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉండడానికి, అత్యధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు బరువు తగ్గడానికి కూడా ఈ ప్రోటీన్ పౌడర్ ను తీసుకోవచ్చు. జీర్ణ వ్యవస్థ ఇబ్బందులను ఎదుర్కొనే చాలామందికి ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి, మలబద్ధ సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ బఠాణి ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం వల్ల కండరాలు కూడా బలంగా మారుతాయి. ఇక దీనిని స్మూతీలు, మిల్క్ షేక్ లా కలుపుకొని తీసుకోవచ్చు.