కాజల్ అగర్వాల్ విషయంలో పూజా అంత పెద్ద తప్పు చేసిందా..? అందుకే ఇలా అనుభవిస్తుందా..?

పాపం పూజ హెగ్డే ..ఎప్పుడో చేసిన తప్పులకు ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకుంటుంది . పూజ హెగ్డే కెరియర్ పిక్స్ లో ఉన్నప్పుడు కన్ను మిన్ను తెలియకుండా ఆడింది. ఎంతలా అంటే తన తోటి హీరోయిన్స్ ని కూడా చులకనగా చూడడం స్టార్ట్ చేసింది . ఈ క్రమంలోనే గతంలో కాజల్ విషయంలో చేసిన తప్పు కారణంగా ఇప్పుడు పూజా హెగ్డే ఆమెకు కాల్ చేసి మరి సారీ చెప్పిందట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది.

కాజల్ అగర్వాల్ ని కొరటాల శివ దారుణంగా చీట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే . ఆచార్య సినిమాలో ఆమెను దారుణాతి దారుణంగా మోసం చేశాడు. మొదట హీరోయిన్గా ఆమెను సెలెక్ట్ చేసుకుని ఆ తర్వాత ఆమెను తీసేశారు . అంతేకాదు ఆ తర్వాత కాజల్ అగర్వాల్ సైతం ఆ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది అని తెలిసి ఆమెకు ఎన్నోసార్లు కాల్ చేసిందట .

అమ్మడు కాల్ లిఫ్ట్ చేయకపోవడమే కాకుండా కాల్ బ్యాక్ కూడా చేయలేదట . దీంతో తీవ్రంగా హార్ట్ అయినా కాజల్ ఆమెను దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. అయితే ఇప్పుడు పూజ కెరియర్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తప్పు తెలుసుకున్న పూజా హెగ్డే కాజల్ లొ కాల్ చేసి మరి సారీ చెప్పిందట . ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!