ఫిదా సినిమాలో ఆ కారణంగానే నటించలేకపోయా.. హరితేజ కామెంట్స్..!!

ఈరోజు సుదీర్ బాబు హీరోగా హర్షవర్ధన్ తెరకెక్కించిన తాజా చిత్ర మామ మచ్చింద్ర.. ఇందులో హీరోయిన్ గా ఈషా రెబ్బా, మృణాళిని రవి ఇందులో హీరోయిన్లుగా నటించారు సుధీర్ కూడా ఇందులో మూడు విభిన్నమైన పాత్రలలో నటిస్తూ ఉన్నారు. ఈనెల 6వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. హైదరాబాదులో నిర్వహించింది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల హీరో శర్వానంద్, శ్రీ విష్ణు, విశ్వక్ సేన్, అశోక్ గల్లా ముఖ్యఅతిథిగా హాజరు కావడం జరిగింది.

విచిత్రంలో నటించిన నటి హరితేజ కూడా పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపింది.. శేఖర్ కమ్ముల గారిని చూడగానే మిమ్మల్ని ఒకటి గుర్తుకు వస్తాంది చెప్పాలనిపిస్తోంది.. నేను మీ ఫీలింగ్స్ కి ఫ్యాన్సా ఫిదా సినిమాలో అక్క క్యారెక్టర్ కోసం మొదట ఆడిషన్స్ కి రమ్మని పిలిచారు నేను ఎలాగైనా సరే మీ దర్శకత్వంలో సినిమా చేయాలనుకున్నాను అలా రెండు మూడు చిత్రాలకు కూడా ఆడిషన్స్ కి వచ్చాను కానీ అప్పుడు ఎందుకు రిజెక్ట్ అయ్యాను తెలుసా అంటూ తెలుపుతూ.. తెలంగాణ యాస రాలేదని ఫిదా సినిమాలో సాయి పల్లవి అక్క పాత్రలో రిజెక్ట్ చేసినట్లుగా తెలిపింది.

Fidaa movie: audience review

ఈ సినిమా తర్వాత నేను తెలంగాణ యాస నేర్చుకున్నాను ఇప్పుడు తెలంగాణ యాసలు బాగా మాట్లాడగలను సార్ అంత ప్యూర్ కాకపోయినా నేను ప్రయత్నిస్తాను తెలియజేసింది. ఆమె మాటలకు శేఖర్ కమ్ముల కూడా కాస్త ఆనందపడ్డాడు.. ఇందులో హరితేజ ఓల్డ్ విమెన్ పాత్రలో కూడా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.