మెగా ఆహ్వానం అందినా వరుణ్ పెళ్లికి నందమూరి హీరో..అంత కోపమా..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టాలీవుడ్ మెగా ప్రిన్స్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ మరికొద్ది గంటల్లోనే పెళ్లి పీటలేకబోతున్నాడు . హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ ప్రముఖులు అందరు ఇటలీకి పయనం అవుతున్నారు.

ఇప్పటికే స్టార్ హీరో నితిన్, రష్మిక మందన్నా, నాగచైతన్య , సమంత ఇటలీకి వెళ్లిపోయారు . వీళ్ళు తాజాగా ఎయిర్పోర్ట్లో కనిపించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అయితే ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ ఫ్యామిలీ అయిన నందమూరి కుటుంబం నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ ఫంక్షన్ కి హాజరు కాకపోతూ ఉండడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అయితే నందమూరి బాలకృష్ణ వెళ్లాలి అనుకున్న పరిస్థితులు అనుకూలించక ఈ పెళ్ళికి వెళ్లడం లేదట . అయితే ఎన్టీఆర్ వీళ్ళ పెళ్లికి వెళ్లాలని పక్కా ప్లాన్ చేసుకున్న కొరటాల శివ లాస్ట్ మూమెంట్లో గోవా షూట్ ప్లాన్ వేయడంతో అంతా ఫ్లాప్ అయింది . ఇలా నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా వెళ్లడం లేదు . మెగా ఆహ్వానం అందిన వరుణ్ పెళ్లికి మాత్రం ఎవరు వెళ్లకపోవడం ఇప్పుడు వైరల్ గా మారింది..!!