“ఫుల్ గా తిని బీరు తాగితే..ఆ ఐడియా వచ్చింది”.. నాగార్జున అంత మాట అనేశాడు ఏంట్రా బాబు..!!

తెలిసి చేశాడో తెలియక చేసాడో తెలియదు కానీ.. నాగార్జున చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తున్నాయి . ఎప్పుడు పద్ధతిగా రాముడు మంచి బాలుడు అనే టైపులో ఉండే నాగార్జున . రీసెంట్గా చేసిన కామెంట్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి . బిగ్ బాస్ ద్వారా ఫుల్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతున్న నాగార్జున రీసెంట్గా ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చాడు .

“కేవలం నవ మన్మధుడు గానే కాకుండా ఆధ్యాత్మిక మూవీలో కూడా మీరు నటించారు .అన్నమయ్య – శ్రీరామదాసు- షిరిడి సాయిబాబా వంటి చిత్రాలలో నటించి మెప్పించారు. ఈ సినిమాలు మీ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అయితే ఇలాంటి సినిమాలలో నటిస్తారని మీరు అనుకున్నారా..? అసలు మీకు ఈ థాట్ ఎలా వచ్చింది అని యాంకర్ అనగా.. నాగార్జున మాట్లాడుతూ ..”నేను ఎప్పుడు ఏది అనుకోని చేయనండి.. ఆ టైం ప్రకారం అది వెళ్ళిపోతూ ఉంటుందంటే ..నిజానికి నేను షిరిడి సాయి సినిమా చేసే వరకు ఒక్కసారి కూడా షిరిడీకి వెళ్లలేదు.. అసలు ఆ ఆలోచన ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు “.

“అంతా బాబా లీల అనుకుంటూ ఉంటాను. సోమవారం నుండి శనివారం వరకు ఫుల్ డైట్ ఫాలో అయ్యే నేను ఆదివారం అస్సలు కంట్రోల్ లో ఉండను. ఏం తింటానో ఎంత తింటానో నాకే తెలియదు . ఒక ఆదివారం ఫుల్ గా నాటుకోడి బిర్యాని తిని ..బీరు తాగి బజ్జున్నాను బహుశా అలాంటి టైంలో ఏమన్నా నాకు కొత్త థాట్స్ వచ్చి ఉంటాయి ఏమో “అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు..!