దేవర సినిమా నుంచి ఫోటో లీక్ చేసిన కొరటలాశివ..!!

ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం దేవర.. ఈ సినిమా కోసం అభిమా నులు చాలా ఆత్రుతగా ఎదురు చేస్తున్నారు..RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు పొందిన ఎన్టీఆర్ ఆ తర్వాత అంతటి స్థాయిలో ఈ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు తెలియజేయడం జరిగింది. ఇందులో హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తోంది. అలాగే బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఈ సినిమా షూటింగ్ నెక్స్ట్ షెడ్యూల్ గోవాలో జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఎన్టీఆర్ కూడా గోవా కి వెళ్లారు.. అక్కడ ఎన్టీఆర్ జాన్వి పైన ఇంపార్టెంట్ సన్నివేశాలను చిత్రీకరించ బోతునట్లు సమాచారం. ఈ క్రమంలోనే తాజాగా జాన్వీ షూటింగ్ ఉన్న సైతం పూర్తి చేసుకుని ముంబైకి చేరుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఒక ఫోటోని షేర్ చేయడం జరిగింది.. దేవర సెట్స్ నుండి టీం.. తంగం గా నటించడం మిస్ అవుతున్నానని ఒక ఫోటోని లీక్ చేయడం జరిగింది..

ఈ పోస్టును బట్టి చూస్తే ఇమే పాత్ర తంగం అనే పాత్ర అన్నట్టుగా తెలుస్తోంది. అయితే తంగం అంటే బంగారమని అర్థమట. ఈ ఫోటోలో ఇమే లుక్ అందరిని ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ముఖ్యంగా లంగా వోణిలో పల్లెటూరి అమ్మాయిల అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. డైరెక్టర్ కొరటాల శివ కూడా ఈమె ఫోటోని షేర్ చేయడం జరిగింది.ప్రస్తుతం ఈ ఫోటో మాత్రం అందరిని ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. దేవర సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కాబోతోంది.