బాలయ్య, చిరు, నాగ్ లకు.. దాసరి ఇచ్చిన ట్యాగ్ లైన్స్ ఏంటో తెలుసా.. ఇప్పటికీ అవే కంటిన్యూ చేస్తున్నారు గా…!!

దాసరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అత్యధిక సినిమాలను చేసి గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నాడు. దాదాపు 150 సినిమాలకు డైరెక్ట్ చేయగా.. 53 సినిమాలకు ప్రొడ్యూసర్ గా.. 250 కి పైగా సినిమాలకు స్టోరీ రైటర్ గా వ్యవహరించాడు. అయితే దాసరి 1992లో సూరిగాడు సినిమాతో హిట్ కొట్టాడు. అనంతరం రామానాయుడుతో ఓ ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ లో జర్నలిస్టులు అప్పట్లో హీరోలపై అడిగిన ప్రశ్నలకు సమాధానం సైతం ఇచ్చాడు.

1. చిరంజీవి-స్టార్ హీరో

2. మోహన్ బాబు-గ్రేట్ ఆర్టిస్ట్

3. బాలయ్య-అందమైన నటుడు

4. నాగార్జున-తెలివైన నటుడు

5. రాజేంద్ర ప్రసాద్-హాస్యానికి

 

6. రాజశేఖర్-కొన్ని పాత్రలు అతనికే సాధ్యం

90స్ లో అంతా చిరంజీవి హవ నడిచేది. ఈ విషయాన్ని దాసరి సైతం ఒప్పుకున్నాడు. కేవలం పోస్టర్ తో ఆడియన్స్ ని థియేటర్లకి రప్పించే సత్తా ఒక్క చిరంజీవికే ఉంది. అనంతరం స్టార్ హీరో కంటే ఆర్టిస్ట్ గొప్పవాడు అంటూ మోహన్ బాబును సైతం పొగిడారు. అలాగే మోహన్ బాబుది ప్రత్యేకమైన శైలి అని కూడా పేర్కొన్నారు. ఏదేమైనాప్పటికీ వీళ్ళకి అప్పట్లో బిరుదులు ఇచ్చినప్పటికీ.. ఆయన నోటు వాక్కు ప్రకారం ఇప్పుడు కూడా అవే పేర్లు వినిపిస్తున్నాయి.