తరుణ్, ఆర్తి అగర్వాల్ పెళ్లి పెటాకులవ్వడానికి కారణం ఏంటో తెలుసా..!!

సాధారణంగా నటీనటులు సినిమాల్లో నటిస్తున్నప్పుడు.. ప్రేమ చిగురించడం జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఒకప్పుడు స్టార్ హీరో, హీరోయిన్గా పేరు పొందిన.. ఆర్తి అగర్వాల్, తరుణ్ కూడా ప్రేమించుకుని వివాహం చేసుకోవాలనుకున్నారు. వీళ్ల పెళ్లికి ఇరుకుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో విడిపోయారు. దీంతో మనసు విరిగిపోయిన ఆర్తి అగర్వాల్ చచ్చిపోవడానికి కూడా ప్రయత్నించింది. వీరి కాంబోలో నువ్వు లేక నేను లేను, సోగ్గాడు సినిమాలు తెరకెక్కాయి.

ఈ క్రమంలోనే వీరి స్నేహం కాస్త ప్రేమ అయినట్లు తెలుస్తుంది. తరుణ్.. ఆర్తి అగర్వాల్ ని పెళ్లి చేసుకోకపోవడంతో ఆమె ఇంకో పెళ్లి చేసుకుని లైఫ్ సెట్ చేసుకుంది. అనంతరం రాజశేఖర్ తో గోరింటాకు సినిమాలో కూడా నటించింది. అయితే తాను ఓవర్ వెయిట్ పెరిగిపోవడంతో.. సర్జరీ చేపించుకునే క్రమంలో తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయింది. ఆ సమయంలో తరుణ్ కి కూడా హీరోగా అవకాశాలు పెద్దగా రాకపోవడంతో ఇండస్ట్రీని విడిచి పెట్టేసాడు. ఓ విధంగా చెప్పాలంటే తరుణ్ కెరీర్ నాశనం అవ్వడానికి తన ప్రేమే కారణం.

ఇద్దరూ ప్రేమించుకున్నప్పుడు.. పెద్దలు ఒప్పుకోకపోతే బయట ఎక్కడైనా పెళ్లి చేసుకోవచ్చు కదా అంటూ వార్తలు సైతం వినిపించాయి. ఈయన చేసిన పనికి ఆడియన్స్ సైతం ఈయన సినిమాలు చూడడానికి ఇష్టపడలేదు. అలాగే పెద్ద అవకాశాలు సైతం రాలేదు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేద్దామని చూస్తున్న ఈ హీరో కి.. ఏ మంచి ఆఫర్ రావడం లేదు. ఆయన కెరియర్ మొదట్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉండేవాడు.