నెక్స్ట్ సినీ చరిత్రను తిరగ రాయబోతున్న టాప్ ఫైవ్ సినిమాలు ఇవే… అన్నిట్లోనూ కామన్ పాయింట్ ఇదే

రెండు పాట్లుగా సినిమాలు రావడం అనేది మొదట హాలీవుడ్ లో మొదలైంది. ఆ తర్వాత బాలీవుడ్ లో సీక్వెన్స్ అనే పేరుతో కొత్త ట్రెండ్ ను మొదలుపెట్టారు. అదే ట్రెండ్ టాలీవుడ్ కి తీసుకొచ్చి పరిమితం చేశారు. కానీ అది వర్కౌట్ కాలేదు. అనంతరం బాహుబలితో నెగిటివ్ సెంటిమెంట్ కి బ్రేక్ పడింది. ఆ సినిమా రెండు భాగాలుగా వచ్చి సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం రెండు భాగాలుగా రిలీజ్ కానున్న సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పుష్ప:


అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 1 రూపొందింది. పుష్ప 1 రిలీజై థియేటర్లో బ్లాక్ బస్టర్ టాక్ నీ దక్కించుకుంది. ప్రస్తుతం ” పుష్ప ది రూల్ ” గా.. రెండో భాగం 2024 అక్టోబర్ 15న విడుదల కానుంది.

2. అఖండ:


బాలయ్య హీరోగా బోయపాటి కాంబోలో వచ్చిన ” అఖండ” సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా రెండో పార్ట్ త్వరలోనే రానుంది.

3. సలార్:

ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న సలార్.. రెండు భాగాలుగా రిలీజ్ కానుంది.

4. దేవర:


ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న.. ఈ సినిమా సైతం రెండు పాట్లుగా థియేటర్స్ ముందుకి రానుంది.

5. స్కంద:


రామ్ హీరోగా బోయపాటి కాంబోలో స్కంద ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ ని దక్కించుకుంది. అలాగే ఈ సినిమా కూడా రెండో పార్ట్ రానుంది.

కేవలం ఈ సినిమాలే కాకుండా.. ఇక అనేక సినిమాలు సైతం రెండు భాగాలుగా రిలీజ్ కానున్నాయి. ప్రస్తుతం రెండు భాగాలు ట్రెండ్ నడుస్తుంది. దీనిపై స్పందించిన ప్రేక్షకులు..” పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు.. ప్రతి ఒక్కరూ ఈ ట్రెండ్ ని గుడ్డిగా ఫాలో అయిపోతున్నారు.. అది కట్ట అటు ఇటు అయితే నెత్తిన గుడ్డేసుకుని ఏడవాల్సిందే. చూద్దాం రానున్న కాలంలో ఏం జరుగుద్దో ” అంటూ కామెంట్లు చేస్తున్నారు.