“యస్ ..ఆ హీరోతో ప్రేమలో ఉన్న”.. రిలేషన్ షిప్ స్టేటస్ ని బయటపెట్టిన మృణాల్..!

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఓపెన్ గా తమ ప్రేమ విషయాన్ని బయట పెడుతున్నారు . రీసెంట్గా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయింది మృణాల్ ఠాకూర్ . బాలీవుడ్ హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ సీతారామం సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది . ఇప్పుడు అమ్మడు చేతిలో ఏకంగా ఐదు బడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి .

తాజాగా ఆమె మీడియా ఇంటరాక్షన్ లో మాట్లాడుతూ తాను ప్రేమలో ఉన్నాను అన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పేసింది . ఎస్ మృణాల్ ఠాకూర్ ఓ హీరోని ప్రేమిస్తుందట. ఆ హీరో పేరుని కూడా బయటకు చెప్పేసింది . హాలీవుడ్ హీరో కీను రీవ్స్.. అంటే తనకు చాలా చాలా ఇష్టమని .. చిన్నప్పుడు తాను చూడగానే ప్రేమలో పడిపోయానని చెప్పుకొచ్చింది .

తనది పూర్తిగా వన్ సైడ్ ప్రేమ అని మృణాల్ చెప్పుకొచ్చింది. అంతేకాదు ఇంట్లో నుంచి పెళ్లి చేసుకోమని ఒత్తిడి పెరుగుతుందని ..ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అంటూ కూడా క్లారిటీ ఇచ్చింది. దీంతో మృణాల్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారింది..!!