” లియో ” కు రిలీజ్‌కి ముందే పెద్ద షాక్.. ఆ ఏరియాలో షోస్ క్యాన్సిల్..

విజయ్ దళపతి హీరోగా త్రిష హీరోయిన్గా దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ చిత్రం ” లియో “. మరి విజయ్ కెరీర్ లోనే మోస్ట్ హైప్ తెచ్చుకున్న సినిమాగా ఇది వస్తుండగా ఈ సినిమా కోసం మేకర్స్ వరల్డ్ వైడ్ గా భారీ ప్లాన్‌లు కూడా చేశారు.

అయితే తమిళ్ నుంచి సౌత్ ఇండియా సినిమా నుంచి కూడా లియో సినిమా గ్రాండ్ గా ఐమ్యాక్స్ స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అలాగే యుఎస్ లో అయితే ఈ సినిమా ఆర్ఆర్ఆర్ కంటే ఎక్కువ స్క్రీన్స్ ని దక్కించుకొని వచ్చింది. అయితే ఇప్పుడు ఈ వర్షన్‌ కి సంబంధించి యుఎస్ లో షాక్ తగిలినట్టుగా తెలుస్తుంది.

యూఎస్ లో ఈ సినిమా ఐమ్యాక్స్ వర్షన్ కంటెంట్ ఇంకా వెళ్లలేదట. దీంతో ఈ షోస్ అన్ని కూడా క్యాన్సిల్ చేసినట్టుగా తమిళ్ సినీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారికి డబ్బులు కూడా వెనక్కి పంపేస్తున్నారట. దీంతో లియో యూఎస్ లో ఈ వెర్షన్ వరకు మాత్రం లేట్ రిలీజ్ కానుంది అని చెప్పాలి.