జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన మీనాక్షి చౌదరి.. కలలో కూడా ఊహించని ఆఫర్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ గుర్తింపు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి మరో జాక్పాట్ ఆఫర్ కొట్టేసిందా ..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో తెలుగు ఆడియోస్ కు పరిచయమైన మీనాక్షి చౌదరి. ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుంది .

అంతేకాదు ఆమె పేరు కూడా జనాలు గుర్తు పెట్టుకోలేకపోయారు . ఆ తర్వాత హిట్ సిరీస్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది . రీసెంట్ గానే మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో ఆఫర్ అందుకుంది . ఆ తర్వాత విశ్వక్ సేన్ – వరుణ్ తేజ్ సినిమాలో కూడా అవకాశం అందుకుంది . ఇటీవలే దుల్కర్ సల్మాన్ నటించబోయే లక్కీ భాస్కర్ సినిమాలోను హీరోయిన్గా ఆఫర్ అందుకుంది.

ఇలా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు అందుకుంటున్న మీనాక్షి చౌదరికి ఇప్పుడు కోలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్ వచ్చింది. విజయ్ తన 68వ సినిమాలో మీనాక్షికి హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది. అక్టోబర్ ఫస్ట్ వీక్ లో ఈ మూవీకి సంబంధించిన పూజ కార్యక్రమాలు గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారట. దీంతో మీనాక్షి టైం బాగుంది అందుకే ఆమెకు ఇన్ని ఆఫర్లు వస్తున్నాయి అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!