2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌ల‌లో భారత్, ఇంగ్లాండ్.. మ‌రి కప్ ఎవరిదో..?

వరల్డ్ కప్ 2023 ప్రారంభానికి కొద్ది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో విశ్వవ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ మొదలైంది. ఎక్కడ చూసినా జనాలు ఈ మెగా ఈవెంట్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు క్రికెట్ కప్ విజేతపై ప్రిడిక్షన్స్ ఇస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా దీనిపై క్విజ్ పోటీలు నడుస్తున్నాయి. వరల్డ్ కప్ విజేతలు ఎవరు కరెక్ట్ గా అంచనా వేసిన వారికి పలు సంస్థలు ప్రైజ్ మనీ కూడా ప్రకటించాయి.

ఈ అంశంపై పలువురు క్రికెటర్లు సైతం తమ అభిప్రాయాన్ని షేర్ చేస్తున్నారు. తాజాగా స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన కార్యక్రమంలో పలు మాజీ స్టోర్లు ఫైనల్ కు చేరే జట్లు పై తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఎవరెవరు ఏయే జట్లు ఫైనల్ కు చేరుతాయని చెప్పారు ఇప్పుడు చూద్దాం.

* జాక్ కల్లిస్ – ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్

* క్రిస్ గేల్- ఇండియా వర్సెస్ పాకిస్తాన్

* షేన్ వాట్సన్ – ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా

* దినేశ్ కార్తీక్ – ఇండియా వర్సెస్ పాకిస్తాన్

* ఫాఫ్ డెప్లెసిస్ – ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా లేదా న్యూజిలాండ్

* వకార్ యూనిస్ – ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్

* డేల్ స్టెయిన్ – ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్

* ఇర్ఫాన్ పఠాన్ – ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా

* ముత్తయ్య మురళీధరన్ – ఇండియా వర్సెస్ పాకిస్తాన్

* సంజయ్ మంజ్రేకర్ – ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా

* పియూశ్ చావ్లా – ఇండియా వర్సెస్ ఇంగ్లండ్

* ఆరోన్ ఫించ్ – ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా

అందరూ స్టార్ క్రికెటర్లు ఈసారి టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్ కు చేరడం ఖాయమని అభిప్రాయపడ్డారు. అయితే ప్రత్యర్థుల విషయంలో మాత్రం ఒక్కొక్కరు అభిప్రాయం ఓకోలా ఉంది. మెజార్టీ శాతం ఇండియా, ఇంగ్లాండ్లు ఫైనల్ కు చేరతాయని అంచినా వేశారు. కొంతమంది భారత్, పాకిస్తాన్ మధ్య ఫైనల్ జరుగుతుందని అంటున్నారు. మరి రన్నరప్ లో ఏ జట్టు ఫైనల్ కు చేరతాయో వేచి చూడాలి.