ఎన్టీఆర్ విషయంలో ఆమె జ్యోతిష్యం ఫలించిందా..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో.. డాన్స్ పెర్ఫార్మెన్స్ తో .. మంచితనంతో ఎంతోమంది హృదయాలను దోచుకున్న ఈయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ.. ఈ సినిమా ద్వారానే తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఇకపోతే సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ అభిమానులకు ఈమధ్య ఎన్టీఆర్ కు సంబంధించిన ఎన్నో విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ విషయంలో ఒక హీరోయిన్ జ్యోతిష్యం కూడా చెప్పిందని.. అది ఫలించింది అని సమాచారం.

అసలు విషయంలోకి వెళితే.. గత నాలుగు సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మీరా చోప్రా కి నెట్టింట పెద్ద యుద్ధమే జరగగా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేధింపులకు విసిగిన మీరా చోప్రా సైబర్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. అయితే మీరా ఎన్టీఆర్ ఎవరో తనకు తెలియదని చెప్పడం వల్లే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమెపై విరుచుకుపడ్డారు.

 

అదే సమయంలో ఎన్టీఆర్ కు, ఆయన ఫ్యాన్స్ కి మద్దతుగా నిలిచిన ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ పాయల్ ఘోష్ మీరా చోప్రా కి కౌంటర్లు వేస్తూ ఎన్టీఆర్ మంచితనాన్ని, గొప్పదనాన్ని చెప్పడమే కాదు ఆయన గ్లోబల్ స్టార్ అవుతారని.. ప్రపంచమంతా ఆయన గురించి మాట్లాడుకుంటారు అని కూడా ఆమె వెల్లడించింది. అయితే అప్పుడు ఆమెను ఎవరు నమ్మలేదు. పైగా ఆమెను చూసి అందరూ నవ్వారు.కానీ ఇప్పుడు ఆమె చెప్పినట్టుగానే ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆయన గ్లోబల్ స్టార్ గా పేరు దక్కించుకున్న విషయం తెలిసిందే. మొత్తానికి అయితే ఎన్టీఆర్ విషయంలో పాయల్ ఘోష్ చెప్పిన జ్యోతిష్యం నిజమైందనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.