యాంకర్ ఉదయభాను – నవీన్ చంద్ర కి మధ్యన అలాంటి సీక్రెట్ రిలేషన్ షిప్ ఉందా..?

హీరో నవీన్ చంద్ర అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో సింగర్ చిన్మయి భర్త రాహుల్ మరో ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఈ సినిమాతో మంచి పాపులారిటీ దక్కించుకున్న నవీన్ చంద్ర తర్వాత పలు సినిమాల్లో నటించిన మెల్లగా అవకాశాలు తగ్గడంతో విలన్ రోల్ లో కూడా యాక్ట్‌ చేశాడు. అరవింద సమేత, నేను లోకల్ లాంటి సినిమాల్లో విలన్‌గా నటించిన నవీన్ చంద్ర ఒకానొక టైం లో అవకాశాలు పూర్తిగా కోల్పోవడంతో డిప్రెషన్ లోకి వెళ్ళాడట.

కానీ మళ్ళీ సినిమాల్లో మెల్లమెల్లగా అవకాశాలు రావడంతో డిప్రెషన్ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాడ‌ట‌. ఇలివ‌ల మంత్ ఆఫ్ మ‌ధు సినిమాలో హీరోగా నటించాడు. కలర్స్ స్వాతి హీరోయిన్గా నటించిన ఈ సినిమా అక్టోబర్ 6న‌ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో పలు సినీ ప్రమోషన్స్ లో హుషారుగా పాల్గొంటున్నారు మూవీ టీం. ఈ మూవీ ప్రమోషన్‌లో పాల్గొన్న నవీన్ చంద్ర తన పర్సనల్ విషయాల గురించి, ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను తెలియజేశాడు.

ఇందులో భాగంగా నవీన్ చంద్ర మాట్లాడుతూ నేను సినిమాలోకి రావడానికి ఆ సీనియర్ యాంకర్ ఏ కారణం అంటూ చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ సీనియర్ యాంకర్ ఎవరో.. అనుకుంటున్నారా.. ఈమె సీనియ‌ర్ యాంక‌ర్ ఉదయభాను. ఆమె ఇన్స్పిరేషన్తోనే నవీన్‌ చంద్ర హీరోగా ఎదిగాడట. వీరిద్దరి మధ్యన ఓ మంచి రిలేషన్ షిప్ ఉంది. ఓ డ్యాన్స్ ప్రోగ్రాం కోసం ఆడిషన్స్ కు వచ్చాడట న‌వీన్‌.. అప్పుడు ఉదయభాను టాప్ యాంకర్ గా కొనసాగుతుంది. ఆ సమయంలో నవీన్ చంద్రతో పరిచయం ఏర్పడింది.

ఇక నవీన్ ఇండస్ట్రీలో హీరో కావడానికి ఉదయభాను ఇచ్చిన ఇన్స్పిరేషన్ ఎంతగానో ఉపయోగపడిందట. ఆ కారణంతోనే ఆయన ఇండస్ట్రీలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలతొక్కుతున్నానంటూ.. ప్రస్తుతం ఉదయభానుతో నేను కాంటాక్ట్ లో లేకపోయినా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఆమెను ఫాలో అవుతూనే ఉంటా అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నవీన్ చంద్ర హీరో అవడానికి పరోక్షంగా ఉదయభాను కారణమా అంటూ అందరూ షాక్ అవుతున్నారు .