నాతో పడుకుంటావా చిన్మయికి నెటిజన్ మెసేజ్.. ఘాటుగా స్పందించిన చిన్మయి..!!

ప్రముఖ నటి సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. గతంలో హీరోయిన్ సమంతకు డబ్బింగ్ చెబుతూ మంచి పాపులారిటీ సంపాదించింది. అంతేకాకుండా నటుడు రాహుల్ రవీంద్రనాథ్ ను వివాహం చేసుకున్న తర్వాత మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఈమె ఎక్కువగా స్రి పక్షపాతి అని ఫిమినిస్ట్ అంటూ ఇమే పైన చాలా రకాలుగా ట్రోల్స్ వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా ఒక నేటిజన్ ఈమెకు ఇంస్టాగ్రామ్ లో పర్సనల్ మెసేజ్ పెట్టారట.. దానికి రిప్లై ఇవ్వకపోవడంతో దారుణమైన మాటలతో ఆమెపైన విరుచుకుపడ్డారు.

మీరంటే నాకు చాలా ఇష్టం మీరు అమ్మాయిల కోసం నిలబడే తీరు నాకు చాలా ఇష్టం మా సిస్టర్ కి కూడా అలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి అంటూ ఇలా చెప్పుకుంటూ వెళ్లారు అయితే ఎంతకీ ఈమె రిప్లై ఇవ్వకపోవడంతో తన నిజ స్వరూపాన్ని బయటపెట్టేశారు ఆ నేటిజెన్.. చివరికి ఆ నెటిజన్ ఎంత కావాలంటే అంత ఇస్తా.. నాతో పడుకుంటావా.. నిన్ను బాగా సుఖ పెడతాను అంటూ ఇలా పిచ్చిపిచ్చిగా మెసేజ్లు చేశారు నేటిజన్.

ఈ విషయం పైన సింగర్ చిన్మయి మండిపడుతూ వీన్ని చూడండి ముందు నాకు పద్ధతిగా మెసేజ్లు చేయడం జరిగింది. నేను రిప్లై ఇవ్వక పోయేసరికి వాడి ఇగో హర్ట్ అయినట్టుంది.. వాడి నిజ స్వరూపాన్ని బయటపెట్టేశారు.. ఇలాంటి వాడిని వాళ్ళ నాన్న చెత్తలో పెంచేశాడు చెత్త నా కొడుకు అంటూ ఇలా చిన్మయి ఫైర్ కావడం జరిగింది.. ఇలాంటి వారు చాలామంది సమాజంలో ఉన్నారు.. అమ్మాయిలు కాస్త జాగ్రత్తగా ఉండండి అంటూ చిన్మయి అందరికీ సలహా ఇవ్వడం జరుగుతొంది. ప్రస్తుతం చిన్మయి అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.