ఈ సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ వర్సెస్ సూపర్ స్టార్..?!

సూపర్ స్టార్ మహేష్ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాను సంక్రాంతి బరిలోనే రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు మూవీ టీమ్‌. అతడు, ఖ‌లేజ సినిమాలు తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలను మరింతగా పెళ్లిచూపు ప్రొడ్యూసర్ నాగ వంశీ గుంటూరు కారం సినిమా కలెక్షన్స్ రాజమౌళి సినిమా రేంజ్ లో ఉంటాయని చెప్పుకొచ్చాడు.

దీంతో ఘట్టమనేని అభిమానులు 2024 సంక్రాంతి మాస్ జాతరకి రెడీ అవుతున్నారు. అయితే ఇప్పటికే ఈ సంక్రాంతి బరిలో గుంటూరు కారం కు పోటీగా కల్కి, హనుమాన్, ఈగల్, వీడి 13, నా స్వామి రంగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇన్ని సినిమాలు ధియేటర్స్ ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటూ ఉన్న సందర్భంలో లేటెస్ట్ గా సూపర్ స్టార్ కి పోటాపోటీగా కోలీవుడ్ తలైవార్ సూపర్ స్టార్ రజినీకాంత్ రంగంలోకి దిగాడు. ఇటీవల జైలర్ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న రజనీకాంత్ మళ్లీ 2024 సంక్రాంతికి ఆడియన్స్ కోసం లాల్ సలాం సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

లాల్ సలాం సినిమాలో రజనీకాంత్ ప్లే చేసింది గ‌స్ట్ రోల్ అయినా ప్రాజెక్ట్ మొత్తం రజనీకాంత్ పేరు మీదనే ఆయన ఇమేజ్ మీదనే థియేట్రిక‌ల్ బిజినెస్ ఆధారపడి ఉంది. లాల్ సలాం సినిమా పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేసుకుంది. కాబట్టి తెలుగులో కూడా మంచి నెంబర్ ఆఫ్ థియేటర్స్ ని సొంతం చేసుకునే ప్రయత్నంలో ఉంది. ఎప్పటికి అనౌన్స్ చేసిన తెలుగు సినిమాలకు థియేటర్స్ దొరకట్లేదు అంటే మళ్ళీ రజినీకాంత్ సినిమా కూడా రంగంలోకి దిగి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ వద్ద ఇబ్బందులు తెచ్చి పెట్టింది.