“తప్పు తెలుసుకున్న శ్రీలీల..ఇక పై చచ్చినా అలా చేయదట”..ఒక్క నైట్ కే ఇంత మార్పా..?

ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది.. అన్ని ఉన్న ఆకు అనిగిమనిగి ఉంటుంది అని .. మన పెద్దవాళ్లు ఊరికే చెప్పరు. అందుకే సోషల్ మీడియాలో మరోసారి అదే సామెతను ట్రెండ్ చేస్తూ శ్రీలీలకు అప్లికేబుల్ చేస్తున్నారు. ఈమధ్య కాలంలో యంగ్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీలీల ఎలా హద్దులు మీరు పోయి సినిమాలను ఓకే చేసిందో మనం చూసాం . ఏకంగా 10 సినిమాలకు సైన్ చేసింది . అంతేకాదు ఆమె అందానికి స్టార్ డైరెక్టర్స్ కూడా ఫిదా అయిపోయారు.

ఆమె అల్లరితనానికి చిలిపితనానికి అందరూ ఆమెతోనే సినిమా తెరక్కించాలని డిసైడ్ అయ్యారు . ఈ క్రమంలోనే బ్యాక్ టు బ్యాక్ అందరికీ కాల్ షీట్స్ ఇచ్చేసిన శ్రీ లీల కరెక్ట్ గా సినిమా టైం వచ్చేసరికి ఆ కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేకపోయింది . ఇంకేముంది ఒక్కొక్క సినిమాను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రీసెంట్ గానే విజయ్ దేవరకొండ విజయ్ తిన్నూరి దర్శకత్వంలోని సినిమాను వదులుకున్న సంగతి తెలిసిందే .

ఇలాంటి క్రమంలోనే శ్రీ లీల ఇకపై అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు అంటూ రియలైజ్ అయిందట . ఒక సినిమాకి సంబంధించిన కాల్ షీట్స్ ఫుల్ గా ఫిల్ అయిన తర్వాతే మరో సినిమాకి కాల్ షీట్స్ ఇవ్వాలని డిసైడ్ అయిందట . అంతేకాదు తొందరపడి ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోకూడదు అని.. తనవల్ల మేకర్స్ ఇబ్బంది పడకూడదు అని డిసైడ్ అయ్యిందట .దీంతో శ్రీలీలకు ఇప్పటికీ జ్ఞానోదయం కలిగిందా అంటూ కొందరు ఆమెను వ్యంగ్యంగా కౌంటర్స్ చూస్తుంటే ..ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుంది అదే బెటర్ కీప్ గోయింగ్ రాక్ శ్రీలీల అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!