చరణ్ ని పెళ్ళి చేసుకోవడం కోసం ఉపాసన అంత పెద్ద త్యాగం చేసిందా..? అందుకే చిరు వయసులో పెద్దది అయినా ఒప్పుకున్నాడా..?

వాట్ .. ఉపాసన రాంచరణ్ కోసం అంత పెద్ద శాక్రిఫైజ్ చేసిందా..? అందుకే రామ్ చరణ్ కుటుంబంలోని వాళ్లు ఆమె వయసులో పెద్దదైన పెళ్లికి యాక్సెప్ట్ చేశారా..? అంటే అవునని సమాధానం వినిపిస్తుంది . రామ్ చరణ్ ఉపాసన ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా రామ్ చరణ్ కంటే ఉపాసన వయసులో రెండేళ్లు పెద్ద ..ఈ విషయం కూడా అందరికీ తెలుసు .

అప్పట్లో ఈ విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . అయితే చిరంజీవి పెద్ద మనసుతో అమ్మాయి మంచిది అన్న ఉద్దేశంతో ఒప్పుకున్నారు . కానీ ఉపాసన రాంచరణ్ కోసం బిగ్ శాక్రిఫైజ్ చేసిందట . ఆ కారణంగానే చిరంజీవి ఒప్పుకున్నారట.  అదే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఉపాసన మొదటి నుంచి పెళ్లయితే అబ్బాయిని ఇల్లరికం తెచ్చుకోవాలన్న ఉద్దేశంతోనే ఉండిందట . ఎప్పుడూ అమ్మాయిల అత్తగారింటికి వెళ్లాలా ..? అమ్మాయిల కోసం అబ్బాయిలు కూడా రావాలిగా..?  అంటూ మైండ్లో ఫిక్స్ అయిపోయిందట .

చరణ్ లవ్ చేసే వరకు కూడా అదే మైండ్ సెట్ తో ఉండిందట.  ఆఖరికి ఉపాసన గురించి చరణ్ ఇంట్లో చెప్పే మూమెంట్లోనూ ఆమె అదే మైండ్ సెట్ లో ఉండిందట.  కానీ తన తల్లి శోభ ఆమెకు నచ్చజెప్పి పెళ్ళంటే ఇది ఓ  సాంప్రదాయం పద్ధతి అంటూ మెగా ఇంటికి కోడలుగా వెళ్ళమంటూ  చెప్పిందట . దీంతో ఉపాసన సైతం మొదటి నుంచి కమిట్ అయిన ఇల్లరికం కాన్సెప్ట్ ను పక్కన పెట్టేసి చరణ్ కోసం అత్తగారింటికి వెళ్లిందట . వరుణ్ పెళ్లి జరగబోతున్న వేళ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!