రవితేజతో జతకట్టబోతున్న విజయ్ బిగిల్ బ్యూటీ.. డైరెక్టర్ ఎవరంటే..?

కోలీవుడ్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటించిన బిగిల్ మూవీ నుంచి ఇప్పటికే చాలామంది స్టార్ బ్యూటీస్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే తాజాగా మరో బ్యూటీ తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టబోతుంది. బిగిల్‌ సినిమాలో విజయ్‌తో కలిసి నటించిన ఇందుజా రవిచంద్రన్ కూడా టాలీవుడ్ లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌నుంది. హీరో రవితేజ – డైరెక్టర్ గోపీచంద్ కాంబినేషన్లో రూపొందుతున్న నాలుగవ సినిమాలో హీరోయిన్గా ఇందుజా నటించబోతోంది. వైవిధ్యమైన కథతో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిపోతున్న ఈ సినిమాలో చెన్నై బ్యూటీ కీరోలు ప్లే చేస్తుంది.

ఇక ఇంజనీరింగ్ చదివే టైంలో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ నటనపై ఉన్న ఆసక్తితో చదువుకునే సమయంలోనే తన కాలేజీలోనూ ఇతర కాలేజీలోనూ నిర్వహించే ఎన్నో కల్చరల్ ఈవెంట్స్ లో ప్రదర్శనలు ఇస్తూ ఉండేది. ఇండస్ట్రీపై ఉన్న ఆసక్తితో ఎన్నో ఆడిషన్స్ లో పాల్గొన్న ఇందుజ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కంటపడింది. ఆమె ఇచ్చిన ఆడిషన్స్ సుబ్బరాజుకు నచ్చడంతో తాను ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన మేయధమాన్ మూవీలో ఇందుజకు ఆఫర్ ఇచ్చాడు. 2017 లో తెరకెక్కిన ఈ సినిమాలో హీరో వైభవ్ కు చెల్లిగా ఈమె కనిపించింది.

తర్వాత మెర్క్యూరీ సినిమాలో మెరిసిన ఈ ముద్దుగుమ్మ పలు సినిమాల్లో నటించినా ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు. ఇక 2019లో తెరకెక్కిన మేగముని, బిగిల్ సినిమాలతో మంచి క్రేజ్‌ తెచ్చుకున్న ఇందూజా రవిచంద్రన్ తిరవన్‌ వెబ్ సిరీస్ లోను నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఇక రవితేజ – గోపీచంద్ కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలవడంతో వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ నాలుగో సినిమాపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచకులు ఉన్నాయి. ఈ సినిమా హిట్ అయితే ఇందుజా దశ తిరిగిన‌ట్లే. ఇక ఈ బిగిల్ బ్యూటీ టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి.