వామ్మో..ప్రగతి ఆంటీ ఆ అంకుల్ ని పెళ్లి చేసుకోబోతుందా..? ఫ్యాన్స్ కి బిగ్ షాక్ ఇది..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సెకండ్ మ్యారేజ్ చేసుకున్న స్టార్ సెలబ్రెటీస్ ల లిస్ట్ ఎక్కువైపోతుంది.  మరీ ముఖ్యంగా కొందరు స్టార్ సెలబ్రెటీస్ లైఫ్ లో మళ్ళీ తమకు తోడు కావాలి అంటూ పెళ్లయి పిల్లలు ఉన్నా కూడా పెళ్ళి చేసుకొని లైఫ్ ని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు . అలాంటి లిస్టులోకి చాలామంది నటీనటులు వస్తారు.  అయితే తాజాగా అదే పని చేయబోతోంది ప్రగతి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రగతి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు . మొదట హీరోయిన్గా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది.  అయితే చిన్న ఏజ్ లోనే పెళ్లి చేసుకొని తప్పు చేశాను అంటూ ఇప్పటికీ బాధపడుతూ ఉంటుంది ప్రగతి . అతగాడితో విడాకులు తీసుకొని లైఫ్ని సింగిల్ గా ఎంజాయ్ చేస్తుంది.

అయితే ఈ క్రమంలోనే ప్రగతి అందంగా ఉండడంతో మంచి మనసు కావడంతో చాలామంది ఆమెకు సెకండ్ పెళ్లి ప్రపోజల్ చేశారట . కానీ ఆమె వేటికీ అంగీకరించలేదు . అయితే రీసెంట్ గా మాత్రం ప్రొడ్యూసర్  ఆమెను పెళ్లి చేసుకుంటాను అని ప్రపోజ్ తేవడంతో ..అతగాడు మంచి క్యారెక్టర్ కావడంతో ..పెళ్లిపై ఇంట్రెస్ట్ చూపిస్తుందట.  నిజంగా ఇది ఫ్యాన్స్ కి బిగ్ షాక్ . ప్రగతి ఇలా రెండో పెళ్లి చేసుకుంటుంది అని ఫాన్స్ కలలో కూడా ఊహించలేకపోయారు . అయితే ఆమె  నిజంగానే పెళ్ళి చేసుకుంటుందా..? లేకపోతే సోషల్ మీడియాలో పుట్టించిన పుకారా..? తెలియాలి అంటే ఆమె స్పందించాల్సిందే..!!