త్వరలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్నాడు . హీరోయిన్ లావణ్య త్రిపాఠిను తన లైఫ్ లోకి ఆహ్వానించబోతున్నాడు . ఇంతకాలం గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపిన ఈ జంట . ఫైనలీ పెళ్లి చేసుకోబోతుంది . తమను కలిపిన కంట్రీ ఇటలీలో వీళ్ళ పెళ్లి గ్రాండ్గా జరగబోతుంది. నవంబర్ ఒకటవ తేదీ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నారు. దీనికి సంబంధించి అన్ని పనులు పూర్తయిపోయాయి. నవంబర్ 5వ తేదీ గ్రాండ్ గా ఇండియాలో హైదరాబాద్లో మాదాపూర్ లో రిసెప్షన్ ఇవ్వబోతున్నారు.
దీనికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా పెళ్లి ఇటలీలో కావడంతో మెగా వరుణ్ తేజ్ పెళ్లికి స్టార్ సెలబ్రిటీస్ ఎవరు అటెండ్ కావడం లేదు. కేవలం మెగా – అల్లు – లావణ్య కుటుంబం మాత్రమే అటెండ్ అవుతుంది. అయితే ఇండస్ట్రీ నుంచి ఒకే ఒక హీరో మాత్రం ఈ పెళ్లికి అటెండ్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఆ హీరో మరెవరో కాదు వరుణ్ తేజ్ కి జాన్ జిగడి దోస్త్ అయిన నితిన్ .
ఎస్ నితిన్ మాత్రమే ఈ పెళ్లికి హాజరు కాబోతున్నారట . మిగతా తెలుగు హీరోలు ఎవరు ఈ పెళ్లికి హాజరు కావడం లేదు . ఎందుకంటే వాళ్ళకి ఆహ్వానం అందలేదు . రీసెంట్గా జరిగిన వరుణ్-లావణ్య సెలబ్రేషన్స్లో కూడా నితిన్ పాల్గొని ఎంజాయ్ చేశాడు. మొదటి నుంచి వరుణ్ – అల్లు అర్జున్ – అల్లు శిరీష్ – చరణ్ – నితిన్ మంచి ఫ్రెండ్స్ అందుకే నితిన్ ఈ పెళ్లికి వెళ్లబోతున్నట్లు తెలుస్తుంది . దీంతో ఇండస్ట్రీ నుంచి వరుణ్ లావణ్య పెళ్ళికి వెళ్లబోతున్న ఏకైక తెలుగు హీరోగా వార్తల్లోకి ఎక్కాడు నితిన్..!!