బన్నీ అంటే ఆ తెలుగు హీరోకి అంత కుళ్లా..? నేషనల్ అవార్డు రావడంతో ఏం చేశాడో తెలుసా..?

సాధారణంగా ఒక మనిషి బాగుపడుతున్నాడు అంటే కింద నుంచి కాళ్లు లాగడానికి నాలుగు చేతులు ఎప్పుడు రెడీగా ఉంటాయి. ఆ మనిషిని తొక్కేయడానికి.. సర్వ నాశనం చేయడానికి కొంతమంది జనాలు కాచుకొని కూర్చుని ఉంటారు . కేవలం సామాన్య జనాలే కాదు ఇండస్ట్రీలో ఉండే స్టార్ ప్రముఖులు కూడా అలాంటి క్యాటగిరీలోకి వస్తారు అంటూ ప్రూవ్ చేశాడు ఓ తెలుగు హీరో .  బన్నీకి రీసెంట్గా నేషనల్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాలో నటించినందుకు గాను బన్నీకి ఉత్తమ జాతీయ నటుడి అవార్డు వరించింది.  గత 69 ఏళ్లగా కోట్లాదిమంది తెలుగు జనాలు ఎప్పుడెప్పుడా అంటూ చూసిన మూమెంట్ రావడంతో.. తెలుగు – తమిళ్ – హిందీ – కన్నడ – మలయాళం లో ఉండే హీరోలు సైతం బ్న్నీకు స్పెషల్గా విషెస్ అందించారు . అయితే మన తెలుగు హీరో మాత్రం అసలు బన్నీకి విష్ చేయలేదు .

అంతేకాదు కనీసం ఆయనను పొగుడుతూ లేదా పుష్ప సినిమాకి సంబంధించి ఓ పోస్ట్ కూడా పెట్టలేదు . రీసెంట్గా నేషనల్ అవార్డు తీసుకున్న బన్నీని చూసి మరింత కుళ్ళుకున్నాడట ఆ హీరో. ఆయనకు సంబంధించిన ఫోటోలు పేపర్ లో రావడంతో కడుపు రగిలిపోయిన ఆ హీరో ఏకంగా పేపర్లను కట్ చేసి తగలబెట్టేసాడట . ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!