టిడిపి ఎమ్మెల్యే, టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలయ్య తాజాగా నటించిన సినిమా ” భగవంత్ కేసరి “. కూతురు సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాలో బాలయ్య హీరోగా నటించిగా కాజల్ అగర్వాల్, శ్రీ లీల, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో అర్జున్ రాంపాల్ విలన్ గా నటించారు. బాలయ్య నటించిన ఈ సినిమా గురువారం థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది.
అయితే ఈ సినిమాలో.. ప్రముఖ వ్యాపారవేత్త అదానీని.. చిత్ర బృందం టార్గెట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వ్యాపారవేత్త అదానీ పేరు వినగానే అందరికీ బొగ్గు కొనుగోలు, పోర్టుల కొనుగోలు ఇలా ఎన్నో రకాల వ్యాపారాలు గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి అదాని.. బాగా దగ్గరగా ఉన్నారు. మోడీ సర్కార్ కు ఎలాంటి నిధులు కావాలన్నా.. ఇచ్చేందుకు అదాని సిద్ధంగా ఉన్నారు. పార్టీ తరపున అతనికి మోడీ ప్రభుత్వం అండగా నిలిచింది.
అయితే భగవంత్ కేసరి సినిమాలో కూడా విలన్ పాత్ర అచ్చం అలాగే ఉంటుంది. ఈ సినిమాలో విలన్ గా చేసిన అర్జున్ రాంపాల్ కూడా అదానీ లాంటి పాత్ర చేశారు. ఏపీలో ఉన్న కృష్ణపట్నం లాంటి ఎన్నో పోర్టులను అదాని కంపెనీ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే అదాని కి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ తరుణంలోనే…అదానీ పాత్ర తరహాలోనే భగవంత్ కేసరి సినిమాలో విలన్ పాత్రను క్రియేట్ చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి అని గుసగుసలు నడుస్తున్నాయి.
అలాగే భగవంత్ కేసరి మూవీలో విలన్ పై చాలా సెటైరికల్ డైలాగులు కూడా ఉన్నాయి. దీంతో ఈ డైలాగులన్నీ జగన్, అదానీని ఉద్దేశించినవే అన్నట్లుగా ఉన్నాయి. అంతేకాదు ఈ సినిమాలో విలన్ పేరు రాహుల్ సంఘ్యి. ఇలాంటి పేరు గుజరాతీలకు మాత్రమే ఉంటుంది. అటు అందానిది కూడా గుజరాతీయే కావడం ఆశ్చర్యం. దీంతో..అదానీని ఊహించే ఈ సినిమాలో విలన్ పాత్ర సెట్ చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి.