బాలయ్య ” భగవంత్ కేసరి ” సినిమాలో… 5 ప్లస్ పాయింట్స్‌ ఇవే…!

నందమూరి బాలకృష్ణ , అనిల్ రావిపూడి కాంబినేషన్లో ” భగవంత్ కేసరి ” నిన్న (అక్టోబర్ 19)న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. బాలయ్య ని ఎలా అయితే అభిమానులు చూడాలనుకుంటున్నారో అలా ఈ సినిమాలో బాలయ్య కనిపించారు. అదిరిపోయే ఎమోషన్స్ తో ఈ సినిమాని తెర మీదకు తీసుకొచ్చారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్ ని అనిల్ రావిపూడి అద్భుతంగా తెరమీదకి తీసుకురావడం జరిగింది.

రెండవ పార్ట్ లో 20 నిమిషాల పాటు బాలయ్య ఫ్యాన్స్ బాలయ్య విశ్వరూపాన్ని చూశారు. బాలయ్య సరికొత్త గెటప్ ని చూస్తూ ఫాన్స్ ఫుల్ ఖుషి అయిపోయారు. ఈ సినిమాలో ప్లస్ పాయింట్ల విషయానికి వచ్చేస్తే.. బాలయ్య నటన అద్భుతంగా ఉంది అలానే అనిల్ రావిపూడి దర్శకత్వం కూడా అదిరిపోయింది. థమన్ బిజిఎం, సెకండ్ హాఫ్, శ్రీలీల నటన ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యాయి.

కానీ కొంచెం ఫస్ట్ ఆఫ్ లో సీన్స్ ని ల్యాగ్ చేయడం, కాజల్ పాత్ర, అక్కడక్కడ ఫైట్ సీన్స్ ని కంపోజ్ చేసిన తీరు సినిమాకి మైనస్ అని చెప్పొచ్చు. బాలయ్య మాత్రం హ్యాట్రిక్ హిట్ కొట్టినట్లు అంతా చెబుతున్నారు. అనిల్ ఫ్యాన్స్ కి మాట ఇచ్చిన విధంగానే బాలయ్యని ఈ సినిమాలో కొత్తగా చూపించారు.