చాలామంది అంటూ ఉంటారు అదృష్టం లేని హీరోయిన్స్ బాలయ్య సినిమాలో నటిస్తే అదృష్టం బ్యాక్ టు బ్యాక్ వెన వెనకే వస్తుంది అని.. బహుశా అది నిజమే అనిపిస్తుంది. రీసెంట్ గా కాజల్ అగర్వాల్ సైతం అదే లక్ ని తన హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని మరి ఇంటికి వెళ్ళింది . రీసెంట్గా భగవంత్ కేసరి సినిమాలో నటించిన కాజల్ కి బంపర్ ఆఫర్ వచ్చింది.
అది కూడా ఆమె రిజెక్ట్ చేసిన హీరోనే మళ్లీ ఆమెను సెలెక్ట్ చేసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . బాలయ్య హీరోగా నటించిన సినిమా భగవంత్ కేసరి . అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిన్న రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద హ్యుజ్ హిట్ టాక్ నమోదు చేసుకుంది . కాగా ఇలాంటి క్రమంలోనే కాజల్ – చిరంజీవి సినిమాలో నటించే ఛాన్స్ అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .
వశిష్ట డైరెక్షన్లో చిరంజీవి ఓ సినిమాలు నటిస్తున్న విషయం తెలిసిందే . ఈ సినిమా కోసం బోలెడు మంది హీరోయిన్స్ ని ట్రై చేశారు . ఫైనల్లీ కాజల్ సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది . నిన్న మొన్నటి వరకు ఈ పాత్రలో అనుష్క ని అనుకున్నారు.. ఇప్పుడు ఆ రోల్ లో కాజల్ ని తీసుకున్నారట. మొత్తానికి బాలయ్య చెయ్యిపడగానే ఈ బ్యూటీ బంపర్ ఆఫర్ తన ఖాతాలో వేసుకోవడం ఇప్పుడు వైరల్ గా మారింది..!!