” బిగ్ బాస్ ” లో ప‌చ్చి బూతులు…” జబర్దస్త్ ” ని మించిపోయారుగా…!

బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ ఉన్నంతలో ఓ మాదిరిగా నడుస్తుంది. గొడవలు, అరుపులు, నామినేషన్స్, ఎలిమినేషన్స్ తో అలా అలా సాగుతుంది. వారం పది రోజుల క్రితం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అని చెప్పి ఐదుగురుని తీసుకొచ్చారు కానీ పెద్దగా మార్పేం రాలేదు. ఇన్నాళ్లు మాటల విషయంలో కాస్త కంట్రోల్ గా ఉన్నోళ్లు ఇప్పుడు ఆ ఒక్క విషయంలో హద్దులు దాటేశారు. డబల్ మీనింగ్ మాటలతో రెచ్చిపోతున్నారు. బిగ్ బాస్ 7లో ప్రస్తుతం ఏడో వారం నడుస్తుంది. భోలె , అశ్విని, తేజ, ప్రశాంత్, పూజ, అమర్, గౌతమ్ నామినేషన్స్ లో ఉన్నారు.

సోమ, మంగళవారాల్లో నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. బుధవారం నుంచి క్యాప్టెన్సీ టాస్క్ మొదలైంది. అయితే హౌస్ అంతా మరీ సీరియస్ గా ఉందని చెప్పి కెప్టెన్సీ కోసం కొన్ని ఫన్నీ టాస్కులు పెట్టారు. ఇందులో భాగంగా రెండు పల్లెటూర్లు అందులోని కంటెస్టెంట్స్ అందరూ ఆయా పాత్రలు పోషించారు. అంతా బాగానే ఉంది కానీ శివాజీ, ప్రశాంత్ చెప్పిన డైలాగ్స్ శృతి మించినట్లు అనిపించాయి. ఈ టాస్క్ లో భాగంగా ప్రశాంత్ ” అన్నా తిప్పేద్దునా ” అని అంటే.. పక్కనే ఉన్న అశ్విని…” ఏంట్రా నువ్వు నన్ను తిప్పేది ” అని అన్నది.

దీనికి బదులుగా ” నా చెంచా ” అని ప్రశాంత్ అన్నాడు. ఇంతలో శివాజీ అక్కడికి వచ్చి..” ఊరుని ఒక ఊపు ఊపుతున్నవట కదా ” అంటూ శివాజీ అన్నాడు. ” ఇంత అందగత్తెని మరి ఆ మాత్రం ఊపనా ఏంటి? “అని అశ్విని అంటుంది. ” నీ అందం ఎంతో చూద్దాం తోటకి రా ఓసారి ” అని శివాజీ కౌంటర్ ఇచ్చాడు. పక్కనే ఉన్న సందీప్..” ఓ పెద్దాయన చాలా లేతాకు ” అంటే.. దానికి శివాజీ కౌంటర్ ఇస్తూ..” ఆకు ఏదైనా ఆకే కదరా , మేము సున్నం రాస్తాం ” అని అన్నాడు. సరిగ్గా గమనిస్తే మాట్లాడే విషయంలో హద్దులు దాటేశారా అని డౌట్ వస్తుంది. అలానే ఇలాంటి డైలాగ్స్ విషయంలో ” జబర్దస్త్ ” షోనీ మించిపోయారు గా.. అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.