టైగర్ నాగేశ్వరరావు: రేణూ దేశాయ్ పాత్రను రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

రేణు దేశాయ్ .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా సినిమాలు చేసిన ఈమె ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది . ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమైంది . ఆ తర్వాత విడాకులు కూడా తీసుకున్నారు . ఆ విషయాలు పక్కన పెడితే ..

రీసెంట్గా రేణు దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది . రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.  ఈ సినిమా మరికొద్ది గంటల్లోనే రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటుంది రేణు దేశాయ్.  కాగా నిజానికి ఈ రోల్ లో డైరెక్టర్ ముందుగా రమ్యకృష్ణను అనుకున్నారట .

కానీ రమ్యకృష్ణ ఈ పాత్ర నచ్చక రిజెక్ట్ చేసిందట.  ఒకవేళ ఆమె సెలెక్ట్ అయి ఉంటే రేణు దేశాయికి ఆ ఛాన్స్ వచ్చేదే కాదు అంటున్నారు అభిమానులు . మరికొందరు రేణు దేశాయ్ మంచి టాలెంట్ ఉన్న నటి అని .. ఈ పాత్ర ద్వారా ఆమె  మరింత స్థాయిలో పాపులారిటీ దక్కించుకుంటుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!