విజ్జి పాత్రను మిస్ చేసుకున్న ఆ అన్ లక్కి హీరోయిన్ ఎవరో తెలుసా..? ఫ్యాన్స్ కడుపు మడిపోతున్నట్లుందే..!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు ఓ రోల్ కోసం చూస్ చేసుకున్న బ్యూటీ ప్లేస్ లో మరో బ్యూటీని సెట్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది . కారణాలు ఏవైనా కానీ అలా మనం మిస్ చేసుకున్న ఆ రోల్ మరో హీరోయిన్ చేతికి వెళ్లి హిట్టు కొడితే ఆ బాధ భరించలేము.  ప్రెసెంట్ అలాంటి సిచువేషన్ ఫేస్ చేస్తుంది కృతిశెట్టి.  కన్నడ బ్యూటీ అయిన ఈ కృతి శెట్టి చేతులారా బంగారం లాంటి అవకాశాన్ని మిస్ చేసుకుంది.

భగవంత్  కేసరి సినిమాలో విజ్జి పాత్రలో శ్రీ లీల కన్నా ముందు కృతి శెట్టిని అప్రోచ్ అయ్యారట మేకర్స్ . కానీ కూతురు పాత్ర చేస్తే హీరోయిన్గా అవకాశాలు రావేమో అన్న భయంతో ఈ పాత్రను మిస్ చేసుకుందట అమ్మడు.  ఫైనల్లీ శ్రీలీల ఆ పాత్రకు సెలెక్ట్ అయింది . ఇప్పుడు కృతి శెట్టి ఆ పాత్రలో ఉండి ఉంటే మరో హిట్ తన ఖాతాలో వేసుకొని ఉండేది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సినిమాలో శ్రీలీల బాలకృష్ణ పెంపుడు కూతురిగా విజ్జిపాప అనే పాత్ర చేసింది. ఈ పాత్రలో శ్రీలీల మెప్పించింది. ఓ పక్క బాలయ్యతో ఎమోషనల్ సీన్స్, మరో పక్క డ్యాన్సులు, కాలేజీ అమ్మాయిలాగా అలరించింది. అయితే ఇన్నాళ్లు డ్యాన్సులతో మెప్పించిన శ్రీలీల ఇప్పుడు యాక్షన్ సీన్స్ తో మెప్పించింది.