భగవంత్ కేసరి రిలీజ్ కి ముందు బాలయ్య అలా చేశాడా..? అందుకే సినిమా హిట్ అయ్యిందా..?

టాలీవుడ్ నరసింహం  గా పాపులారిటీ సంపాదించుకున్న నందమూరి బాలయ్య తాజాగా నటించిన సినిమా భగవంత్ కేసరి . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కొద్ది గంటల క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది.  అంతేకాదు బాలయ్య కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది .

ఈ సినిమాలో ఆయనకు జోడిగా కాజల్ అగర్వాల్ నటించగా కూతురి పాత్రలో శ్రీ లీల కనిపించి మెప్పించింది .  భగవంత్ కేసరి సినిమా హిట్ అవడానికి బాలకృష్ణ ఎంత కారణమో శ్రీలీల కూడా అంతే కారణం అని సినిమా చూసిన ఎవరికైనా అర్థం అయిపోతుంది . కాగా ఈ సినిమా రిలీజ్ అయ్యే కొన్ని గంటల ముందు బాలయ్య చేసిన పని వైరల్ గా మారింది.

నిజానికి బాలయ్య తను నటించిన సినిమాలు ఏదైనా రిలీజ్ అయ్యే ముందు టెన్షన్ పడతారట . కానీ బాలయ్య ఈ సినిమా విషయంలో అస్సలు టెన్షన్ పడలేదట . రాత్రంతా ప్రశాంతంగా పడుకొని ఉదయం లేచి అమ్మవారికి పూజ  చేసుకున్నాడట.  అదే టైంలో అనిల్ రావిపూడి కాల్ చేసి సినిమా సూపర్ డూపర్ హిట్ సార్ అంటూ చెప్పుకొచ్చాడట. అంతేకాదు అనిల్ రావిపూడి ఎక్కడ ఈ సినిమాలో వల్గారిటి చూపించలేదు . ఈ సినిమా హిట్ అవ్వడానికి అది కూడా మరొక రీజన్ అంటున్నారు అభిమానులు..!!