మరో ఆస్కార్ రికార్డును ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్..!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంతటి గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించిన ఎన్టీఆర్ తన కెరీర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి ఎన్నో గొప్ప సినిమాలలో నటించారు. టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి కి అభిమాన హీరోగా పేరు సంపాదించారు ఎన్టీఆర్. RRR సినిమాతో తన నటనతో హాలీవుడ్ దిగ్గజాలతోనే ప్రశంశలు సైతం అందుకునేలా చేశారు. ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఎన్టీఆర్ స్థాయి కూడా మరి కాస్త పెరిగిపోయింది.

ఇప్పటికే జాతీయ రాష్ట్రస్థాయిలో ఎన్నో అవార్డులను రివార్డులను అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు మరొక అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ లో ఎన్టీఆర్ కు చోటు లభించడం గమనార్హం. ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ కొత్త నెంబర్ క్లాస్ అఫ్ యాక్టర్లు ఎన్టీఆర్ కు స్థానం లభించింది.. ఈ ఏడాదికి గాను ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ లో ప్రపంచవ్యాప్తంగా కేవలం ఐదు నటులకు చోటు దాకడం జరిగింది అందులో ఎన్టీఆర్ తో పాటు తదితరులు ఉన్నారు.

ఈ విషయం తెలిసి తెలుగు సినీ పరిశ్రమతో పాటు ఇతర సీని పరిశ్రమల నుంచి ఎన్టీఆర్ కు ప్రశంసలు వెళ్ళబడుతున్నాయి.ఎన్టీఆర్ అభిమానులకు కూడా ఈ విషయం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది.. ఎన్టీఆర్ ప్రతిభకు ఇలాంటి అవార్డులు మరిన్ని రావాలని సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు. ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది పాన్ ఇండియా లెవెల్లో ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by The Academy (@theacademy)