ఎంతమంది అడిగిన..ప్రభాస్ బర్త డే రోజు ఆ పని మాత్రం చచ్చిన చేయడు.. ఎందుకంటే..?

ప్రభాస్ .. ఆ పేరు చెప్తుంటేనే తెలియకుండా వైబ్రేషన్స్ వచ్చేస్తాయి . ఆ కటౌట్ చూస్తుంటే గూస్ బంప్స్  రావాల్సిందే . అలాంటి ఓ చెరగని క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఈ ఆరడుగుల అందగాడు.  నేడు ఆయన తన 44వ పుట్టినరోజును చాలా గ్రాండ్గా అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు.  సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులు – ప్రభాస్ ఫ్యాన్స్ – కుటుంబ సభ్యులు – బంధుమిత్రులు – ఆయన జాన్ జిగిడి దోస్తులు ఆయనకు విషెస్ అందజేస్తున్నారు.

ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ తన పుట్టినరోజు నాడు ఎప్పుడూ కూడా అలాంటి పని చేయడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ప్రభాస్ మొదటి నుంచి మంచి భోజన ప్రియుడు. ఫుడ్ బాగా తింటాడు ఆ విషయం అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా నాన్ వెజ్ అంటే ప్రభాస్ బాగా లైక్ చేస్తాడు.  ప్రతిరోజు నాన్ వెజ్ తినే ప్రభాస్ తన పుట్టినరోజు నాడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం ముట్టనే ముట్టడట .

అంతేకాదు ప్రభాస్ తన పుట్టినరోజు నాడు పార్టీలు ఇవ్వడం కంటే నలుగురు పేదవాళ్లకు అన్నం పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడట . అలాంటి క్యారెక్టర్ చిన్నప్పటినుంచి ప్రభాస్ కు ఆటోమేటిక్గా వచ్చేసింది అంటూ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ తో పార్టీలు పబ్బులు అంటూ ఎంజాయ్ చేయడట.. ప్రశాంతంగా కూర్చొని మాట్లాడడానికి ఇష్టపడతాడట .. అన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నా మన ప్రభాస్ ను చేసుకోబోయే అమ్మాయి సో లక్కీ అంటున్నారు అభిమానులు..!