తండ్రి కొడుకులుగా సముద్రఖని, ధనరాజ్… వామ్మో ఇంత ఎమోష‌న‌ల్‌గానా..!

స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 తెరకెక్కిస్తున్న ద్విభాష మూవీ పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. నటుడు ధనరాజ్ మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో గ్రాండ్ గా జరిగాయి.

క్లాప్ శివ బాలాజీ, కెమెరా సోలో బతుకే సో బెటర్ డైరెక్టర్ సుబ్బు, ఫస్ట్ షాట్ డైరెక్షన్ బలగం వేణు చేశారు.
అలాగే ఆమిగోస్ డైరెక్టర్ రాజేంద్ర తెలుగు స్క్రిప్ట్ అందజేయాగ , డియర్ కామ్రేడ్ డైరెక్టర్ భరత్ కమ్మ తమిళ్ స్క్రిప్ట్ ను యూనిట్ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, తాగుబోతు రమేష్, మధునందన్ , భూపాల్, పృథ్వి, రాకెట్ రాఘవ తదితరులు పాల్గొన్నారు.

తండ్రి కొడుకులుగా సముద్రఖని, ధనరాజ్ నటిస్తున్న ఈ సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్,పృద్వి, అజయ్ ఘోష్, లావణ్య రెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. విమానం సినిమా దర్శకుడు శివ ప్రసాద్ యానాల ఈ సినిమాకు కథ ,మాటలు సమకూర్చారు.

ఎవరు టచ్ చేయని ఒక తండ్రి కొడుకుల ఎమోషన్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.శశి సినిమా సంగీత దర్శకుడు అరుణ్ చిలువేరు ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. దుర్గా ప్రసాద్ ఈ సినిమాకు కెమెరామెన్.