ప్రభాస్ ఆస్తి ఎన్ని వేల కోట్లో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీకి మొట్టమొదటిగా ఈశ్వర్ సినిమాతో పరిచయం అయ్యి ఆ తర్వాత అంచలంచలుగా ఎదిగి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా పేరు పొందిన హీరో ప్రభాస్.. ఎంతమంది అభిమానులను సంపాదించారు బాహుబలి, బాహుబలి 2 చిత్రం ద్వారా మర్చిపోలేని గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత సాహో, రాధేశ్యామ్‌, ఆది పురుష్‌ సినిమాలు పెద్దగా మెప్పించలేకపోయాయి. అయినా కానీ ఆయనకి మాత్రం క్రేజ్ తగ్గేదే లేదు.ప్రభాస్ 1979 అక్టోబర్ 23న జన్మించాడు. అంటే ఇవాళ ప్రభాస్ పుట్టిన రోజు కాబట్టి ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో ఈ పాన్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ పేరు మార్మోగిపోతోంది.

దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్స్ ప్రభాస్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే పలు అన్నదానాలు రక్తదానాలు శిబిరాలను ఏర్పాటు చేశారు. బాహుబలి సినిమా తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్ అయినంత మాత్రాన ప్రభాస్ కి క్రేజ్ తగ్గదు ఇప్పుడు డార్లింగ్‌ నటిస్తోన్న సలార్‌, కల్కి సినిమాలపై ఉన్న అంచనాలు భారీగా ఉండడమే దీనికి నిదర్శనం. వీటిలో ఏ ఒక్కటి హిట్‌ అయినా ప్రభాస్‌ రేంజ్‌ నెక్ట్స్‌ లెవెల్‌కి వెళ్లిపోవడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్‌. కాగా సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోల్లో ప్రభాస్‌ కూడా ఒకరు.

ఇక ప్రభాస్ ఆస్తుల విలువ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు ప్రభాస్ కి 1500 వందల కోట్ల ఆస్తులు ఉన్నాయట. సినిమా ఇండస్ట్రీలో భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న వ్యక్తి కూడా ఈయనే హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ప్రభాస్‌కు ఓ ఇల్లు ఉంది. దీని విలువ 60 కోట్ల రూపాయల పైమాటేనట. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభాస్ ఆస్తులు లెక్కపెట్టలేము బోలెడన్ని ఖరీదైన కార్లు అలాగే బంగ్లాలు ఇలా చెప్పుకుంటే రెబల్ స్టార్ ప్రభాస్..ఈరోజు ప్రభాస్ పుట్టిన రోజు కాబట్టి అభిమానులంతా తనకి విషెస్ ని తెలియజేస్తున్నారు.