జాతీయ అవార్డులు మనవాళ్లను ఎప్పటినుండో ఊరిస్తున్నాయి. అయితే ఎట్టకేలకు మన టాలీవుడ్ హీరో ఎవరూ అందుకోని అరుదైన జాతీయ అవార్డుని 2023కిగాను ఉత్తమనటుడి కేటగిరీలో అందుకున్నాడు. కాగా అల్లు అర్జున్ ఆ అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకోవడంతో అల్లువారి అభిమానులు అయితే సంబరాలు చేసుకున్నారు. పుష్ప సినిమాలో హీరోగా అల్లు అర్జున్ తన నటన విశ్వరూపం చూపించడం అందరికీ తెలిసినదే. అందుకే జాతీయ అవార్డు ని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. కొందరు బన్నీ అవార్డ్ గురించి పాజిటివ్ గా మాట్లాడుకుంటూ ఉంటే మరి కొందరు మాత్రం నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.
అదంతా ఒకెత్తయితే వచ్చే సంవత్సరానికి గాను ఎన్టీఆర్ దేవర సినిమాకి ఉత్తమ నటుడు అవార్డ్ ని అందుకోబోతున్నాడు అంటూ నందమూరి అభిమానులు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ఎన్టీఆర్ – కొరటాల కాంబోలో వస్తున్న ఆ సినిమా ఏ స్థాయిలో వుంటుందో కాలమే నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఆ సినిమా విడుదలకు ఇంకా వేచి చూడాల్సిన అవసరం వుంది. లేదు మా హీరోకి ఈసారి అవార్డ్ రావడం ఖాయం అంటున్నారు నందమూరి ఫాన్స్. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకే రావలసింది… మిస్సయింది. ఈ సారి ఖచ్చితంగా మావోడు కొడతాడు అంటూ ఛాలెంజులు చేస్తున్నారు.
మరోవైపు, హీరో రామ్ చరణ్ అభిమానులు కూడా అదే ధీమాని వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకి రావలసింది ఎన్‌టిఆర్ కి కాదు, మావోడికి అంటూ నందమూరి ఫాన్స్ కి కౌంటర్స్ వేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సారి ఖచ్చితంగా మావోడు ‘గేమ్ ఛేంజర్’ సినిమాకి అవార్డులమీద అవార్డులు కొడతాడు అంటూ ఒకరిపై ఒకరు ఛాలెంజులు విసురుకుంటున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాకి తమిళ దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి విదితమే. చూడాలి మరి! ఎవరి కోరిక నెరవేరుతుందో?