Tiger 3: టవల్ ఫైట్ కోసం డైరెక్టర్ కత్రినాకు అలాంటి వీడియోస్ చూపించారా..?

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా టైగర్ 3.  రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది . ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ టు ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సీన్స్ తో అదరగొట్టేసాడు సల్మాన్ . అంతేకాదు కత్రినా కైఫ్ కూడా తన అందచందాలతో బాగా అలరించింది . అయితే సల్మాన్ ఖాన్ ఈ ట్రైలర్ లో ఎంత యాక్షన్స్ సీన్స్ లో పాల్గొన్నా కానీ అందరి కళ్ళు కత్రినా వైఫై పడ్డాయి .

మరీ ముఖ్యంగా ట్రైలర్ లో చూపించిన టవల్ ఫైట్ సీన్ ట్రైలర్ కి హైలెట్గా మారింది. కత్రినా గురించే ఇప్పుడు అందరూ జనాలు మాట్లాడుకుంటున్నారు . ఈ సీన్ లో కత్రినా అంత బోల్డ్ గా ఎలా నటించగలిగింది అంటూ గుసగుసలాడుకుంటున్నారు . అంతేకాదు డైరెక్టర్ మనీష్ ఈ టవల్ సీన్ చెప్పగానే కత్రినా చేయను అంటూ మొండి చేసిందట .అయితే హీరోయిన్స్ ఎలాంటి పాత్రలు అయినా చేయగలగాలి అంటూ కొన్ని హాలీవుడ్ మూవీస్ కి సంబంధించిన వీడియోస్ చూపించాక ..

ఎస్ హీరోయిన్స్ ఎలాంటి రోల్స్ అయినా ఎలాంటి ఫైట్ సీన్స్ అయినా చేయాలి అంటూ ఈ టవల్ ఫైట్ సీన్ ను చేయడానికి ఒప్పుకునిందట . ఇది నిజంగా ఒరిజినల్ గానే  తెరకెక్కించిన ఫైట్ సీన్ అని.. ఎటువంటి గ్రాఫిక్స్ లేవు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు . దీంతో ఈ సినిమాకి ఈ ఫైట్ సీన్స్ హైలెట్ కాబోతుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!